బాధిత రైతు భూమిని పరిశీలించేందుకు వచ్చిన తహసీల్దార్ అడ్డగింత
సకాలంలో స్పందిస్తే ప్రాణాలు దక్కేవని ఆగ్రహం
న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకోలు
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్టుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ భూసమస్యతో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు బుధవారం తహసీల్దార్ రమేశ్ గ్రామానికి వచ్చారు. దీంతో ప్రభాకర్ కుటుంబసభ్యులు ఆయనను అడ్డుకున్నారు. భూసమస్యపై ఫిర్యాదు అందగానే అధికారులు స్పందిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఆయన తండ్రి బోజెడ్ల పెద్దవీరభద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
గత వేసవిలో సుమారు రూ.8 లక్షలు వెచ్చించి తమ భూమిలోకి మొరం మట్టి తోలించగా, చెరువు శిఖాన్ని ఆక్రమించారంటూ మత్స్యశాఖ సొసైటీ మూడు ఎకరాల్లో మట్టి తొలగించిందని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ను పొలంలోకి రాకుండా అడ్డుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎస్సై నాగుల్‌మీరా వారికి సర్దిచెప్పి తహసీల్దార్‌ను కారు ఎక్కించారు. అయినప్పటికీ వారు కారుకు అడ్డుగా కూర్చోవడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పగా వారు శాంతించారు.
విచారణలో వేగం: రైతు ప్రభాకర్ ఆత్మహత్యను సీరియస్‌గా పరిగణించిన సీఎం రేవంత్‌రెడ్డి, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేÔశారు. రైతు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక పోలీసులు తమకు లభించిన వీడియోలను సైతం
పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment