సాక్షి, ఖమ్మం జిల్లా: పార్టీ మార్పుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగచాటుగా పార్టీ మారే అవసరం తనకు లేదన్నారు. ‘‘పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున అభిమానుల సమక్షంలో మారుతా.. నేను ఎక్కడున్నా కార్యకర్తలకు అండగా ఉంటా’’ అని పొంగులేటి అన్నారు.
కాగా, ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తీవ్ర అసంతృప్తిలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఇందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో.. జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం తాజాగా తెర మీదకు వచ్చింది.
పార్టీలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది తాజాగా ఆయన చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అయితే.. ఆయన పార్టీ మారతానని నేరుగా మాత్రం ప్రకటించలేదు. కానీ, తెర వెనుక బీజేపీ అధిష్టానం నేరుగా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment