
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా కొట్టడంతో కారు ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాల తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment