విజయవాడలో టీడీపీ నేత కారు బీభత్సం | Car Accident In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో టీడీపీ నేత కారు బీభత్సం

Published Sat, Nov 16 2024 5:19 PM | Last Updated on Sat, Nov 16 2024 5:42 PM

Car Accident In Vijayawada

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రభ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునే వ్యక్తిని టీడీపీ నేత కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో పికా కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఉయ్యూరు వెంకటరమణదిగా గుర్తించారు. కారుపై జై టీడీపీ, జై వసంత, టీమ్ రమణ అని రాసి ఉన్న స్టిక్కర్‌తో కూడిన ఎమ్మెల్యే ఫోటో ఉంది. ప్రమాద ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రన్నింగ్‌ కారులో మంటలు
చిత్తూరు జిల్లా: పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. ఐదుగురితో తిరువన్నమలై నుండి ముల్బాగల్ వెళ్తుండగా ఘటన జరిగింది. హఠాత్తుగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్ర​మాదం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇదీ చదవండి: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement