ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.
చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.
క్యాష్‌లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.
కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.
ఇక రెండోది.. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్‌లైన్‌లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్
కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment