
ఆగి ఉన్న రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొన్న కారు
కారును ఢీకొన్న ప్రయాణికుల టాటా ఏస్ వాహనం
మరో ముగ్గురి పరిస్థితి విషమం
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెడీమిక్స్ వాహనం మరమ్మతులకు గురవడంతో పెదకాకాని క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట జాతీయ రహదారిపై మార్జిన్‌లో డ్రైవర్ నిలిపారు. విజయవాడ నుంచి గుంటూరుకి అతి వేగంగా వస్తున్న కారు రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది.
దీని వెనుక ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం అతివేగంగా కారును, రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, టాటా ఏస్ వాహనంలో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment