మెదక్‌: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి | Car Accident At Shivampet In Medak District | Sakshi
Sakshi News home page

మెదక్‌: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Published Wed, Oct 16 2024 5:02 PM | Last Updated on Wed, Oct 16 2024 5:23 PM

Car Accident At Shivampet In Medak District

సాక్షి, మెదక్‌: శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు.

ఈ ఘటనలో డ్రైవ‌ర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement