shivampet
-
మెదక్: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
సాక్షి, మెదక్: శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు.ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మెదక్ జిల్లా శివం పెట్ MRO ఆఫీస్ లో కలకలం
-
ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం చేసిన ఘటన శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్ఐ రమేశ్ తెలపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో పానగారి సుధాకర్ విద్యా వలంటీర్. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లగా.. పంచాయతీ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న బాలిక నాయినమ్మ పని నిమిత్తం పంబయటకు వెళ్లింది. చదవండి: పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో! చిన్నారి ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించిన సుధాకర్ ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులను చూసి అక్కడి నుంచి ఉడాయించాడు. రాత్రి చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు 100కు డయల్ చేసి విషయం చెప్పారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్‌ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
స్తంభంపైనే మృత్యువాత
శివ్వంపేట (నర్సాపూర్): బోరుబావి సర్వీస్ వైరు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మణ్(40) విద్యుత్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు స్థానిక రైతులకు ఏదైనా సమస్యలు తలెత్తితే లక్ష్మణ్‌తో చేయిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ అలీ బోరు మోటారు సర్వీస్ వైర్ కనెక్షన్ ఇచ్చేందుకు లక్ష్మణ్‌ని తీసుకెళ్లాడు. కాగా, పెద్దగొట్టిముక్ల కు చెందిన రైతు అనిల్ ఆదివారం తన వరి పంటను కోసేందుకు కోత యంత్రం రావడంతో విద్యుత్ వైర్లు కిందికి ఉన్నాయని ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసి, ఆన్ఆఫ్ హ్యాండిల్‌కు టవల్ చుట్టి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలానికి వచ్చిన అనిల్.. ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేయగా.. అప్పటికే లక్ష్మణ్ విద్యుత్ స్తంభంపై ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడు. -
ట్రాక్టర్ ఆత్మహత్య.. ఎందుకిలా?
మెదక్ జిల్లాలో చిత్రమైన ఘటన జరిగింది. ఇద్దరి మరణానికి కారణమైన ఓ ట్రాక్టర్.. తనంతట తానే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎందుకు జరిగిందో చూసేవాళ్లెవరికీ అర్థం కాలేదు. విషయం ఏమిటంటే.. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో కరెంటు స్తంభాల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. దారిలో వెళ్తున్న నలుగురిని ఢీకొంది. దాంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రాక్టర్ వెనక ఉండే ట్రైలర్ తిరగబడింది. రోడ్డు వారగా ఉన్న ట్రాక్టర్.. ట్రైలర్ రెండూ ట్రాఫిక్‌కు అడ్డంగా ఉండటంతో ఓ పొక్లెయిన్‌ను రప్పించి, దాంతో ట్రైలర్‌ను సరిచేశారు. ఆ వెంటనే ట్రాక్టర్ దానంతట అదే రోడ్డు దిగువన ఉన్న పొలంలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు దాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నించారు. మధ్యలో గట్లు అడ్డు వచ్చినా కూడా ఆగకుండా ట్రాక్టర్ మధ్యమధ్యలో తన దారి కూడా మార్చుకుంటూ.. నేరుగా వెళ్లి పొలంలో ఉన్న ఓ బావిలో పడిపోయింది. దాని వెంట పరుగుపెడుతున్న ప్రజలు ఒక్కసారిగా అక్కడ ఆగిపోయి.. ఇలా జరిగిందేంటబ్బా అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ట్రాక్టర్ ఆత్మహత్య.. ఎందుకిలా?