
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం చేసిన ఘటన శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ రమేశ్ తెలపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో పానగారి సుధాకర్ విద్యా వలంటీర్. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లగా.. పంచాయతీ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న బాలిక నాయినమ్మ పని నిమిత్తం పంబయటకు వెళ్లింది. చదవండి: పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో!
చిన్నారి ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించిన సుధాకర్ ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులను చూసి అక్కడి నుంచి ఉడాయించాడు. రాత్రి చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు 100కు డయల్ చేసి విషయం చెప్పారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్‌ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment