
పొగ కాలుష్యం... హుష్‌కాకి!
వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా పిల్లలకూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క వాయు కాలుష్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు నాలుగు లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఈ సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలూ తక్కువేమీ కాదు. ఢిల్లీలో వాహనాల సరిబేసి సంఖ్యల స్కీమ్‌లు ప్రవేశపెట్టినా, చైనాలో గంటకు 30 వేల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేయగల టవర్లను పెట్టడం ఇందుకోసమే. అయితే వీటితోపాటు ఇంకా అనేక టెక్నాలజీలు, డిజైన్లు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు సాయమందిస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటిని మనం పక్క ఫొటోల్లో చూడవచ్చు.
మొదటి ఫొటో... మెక్సికో నగరంలోని మాన్యుల్ గియా గొంజాల్వెజ్ ఆసుపత్రి. తేనే తుట్టె ఆకారంలో ఉన్న భవనం ముందువైపును చూశారు కదా. దాంట్లో ఉపయోగించిన టైల్స్‌పై అత్యంత పలుచగా టైటానియం డయాక్సైడ్ రసాయనాన్ని పూశారు. వెలుతురు సోకగానే గాలిలోని కాలుష్యకారక కణాలన్నీ దీనికి అతుక్కుపోతాయి.
ఇక రెండవ ఫొటో... ఈ రంగు రంగుల పెంకులను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, రివర్‌సైడ్ విద్యార్థులు తయారు చేశారు. ఇది కూడా టైటానియం డయాకై ్సడ్ పూత ద్వారా గాలిలోని నైట్రోజన్ ఆకై ్సడ్‌ను 88 నుంచి 97 శాతం వరకూ తగ్గిస్తుంది. బంకమట్టితో తయారు చేశారు కాబట్టి పెద్దగా ఖర్చు కూడా కాదన్నమాట.
మూడవ ఫొటో... పచ్చటి చెట్లతో కళకళలాడుతున్న బిల్డింగ్ ఉందే... ఇటలీలోని మిలాన్ నగరంలో కట్టేస్తున్నారు దీన్ని. దీనిపై నాటిన మొక్కల విస్తీర్ణం 2.5 ఎకరాల అడవితో సమానం. గాలిలోని కార్బన్ డయాకై ్సడ్‌ను మింగేయడంతో పాటు, రణగొణధ్వనులు, సూర్యుడి ప్రతాపాన్ని తగ్గించి... ప్రశాంతతను ఇస్తాయి ఇవి. ఇక మిగిలింది
నాలుగో ఫొటో... హోర్డింగ్ తాలూకుది. ఒక్కదెబ్బకు రెండుపిట్టలంటారే... ఆ టైప్ ఇది. హోర్డింగ్‌పై వాణిజ్య ప్రకటనలు కొత్త విషయం కాకపోవచ్చు గానీ, పెరూ రాజధాని లిమాలో ఉన్న ఈ హోర్డింగ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఇది రోజుకు దాదాపు లక్ష ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. టైటానియం డయాకై ్సడ్ కాకుండా... నీటి ఆధారంగా పనిచేసే మరో రసాయనాన్ని వాడారు దీంట్లో. వాహనాల పొగలోని కాలుష్యాన్ని మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, సూక్ష్మ కణాలను కూడా శుభ్రం చేయడం దీనికున్న అదనపు సామర్థ్యం!