తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనా. ముఖ్యంగా శృంగార తార అనే ముద్రను వేసుకున్నారు. ఇదే తనకు నచ్చలేదని సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నటి సోనా దర్శకురాలిగా పరిచయం అవుతూ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ స్మోక్. సోనా జీవిత చరిత్రతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ వివరాలను సోనా వెల్లడించారు.
తాను నటిగా 2000 సంవత్సరంలో పరిచయం అయ్యానని చెప్పారు. అలా ఈ 23 ఏళ్లు ఎంతో సంతోషాన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. శారీరకంగానూ మానసికంగానూ చాలా గాయపడ్డారని చెప్పారు. ఒకానొక సమయంలో సినిమాలు వద్దనుకొని ఇంట్లోనే గడిపానన్నారు. పలు భాషల్లో సుమారు 150 కి పైగా చిత్రాల్లో నటించానని చెప్పారు.
తనపై శృంగార తార ముద్ర పడడంతో అందుకు గల కారణాలను వెతుకున్నానని, పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదని వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు కారణంగా జీవితాలు మలుపు తిరుగుతాయని పేర్కొన్నారు. ఆ విధంగా తనపై పడ్డ శృంగార తార అనే ముద్రను చెరుపుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ స్మోక్ అని చెప్పారు. తాను దర్శకురాలిగా మారడానికి ముందు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వం, చాయాగ్రహణం శాఖల్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. తన జీవితంలో 99.9% వాస్తవాలను ఆవిష్కరించే వెబ్ సిరీస్‌గా స్మోక్ ఉంటుందన్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం అయిన తర్వాత పరిహాసాలు విమర్శలు ఎదురవ్వవచ్చన్నారు. ఇది పూర్తిగా తన జీవిత చరిత్ర అని ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని చెప్పారు. దీనికి షార్ట్ ఫ్లిక్ ఓటీటీ సంస్థ సహకారం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment