వాళ్లంటే త్రిషకు కోపమంట | Smoking Affect Allergy Gautham Menon movie | Sakshi
Sakshi News home page

వాళ్లంటే త్రిషకు కోపమంట

Published Sun, Nov 2 2014 1:34 AM | Last Updated on Mon, Oct 22 2018 2:14 PM

వాళ్లంటే త్రిషకు కోపమంట - Sakshi

వాళ్లంటే త్రిషకు కోపమంట

సరదాసరదా సిగరెట్టు ఇది దొరలు తాగుబుల్ సిగరెట్టు. ఇది కాలాన్ని జయించిన విజయవంతమైన గీతం. ఇక ఈ పాట సంగతి అలా ఉంచితే సిగరెట్టు అన్నా వాటిని పీల్చేవారన్నా త్రిషకు యమకోపమట. ఏమిటి నమ్మకం కలగటం లేదా? అయితే అసలు సంగతేమిటో చూద్దాం. మూగ జీవాలు ముఖ్యంగా శునకాలపై ఎనలేని మమకారం చూపే త్రిష వాటిని ఎవరైనా రాళ్లతో కొడుతున్నట్టు గానీ, హింసిస్తున్నట్లు గానీ తన కంటబడితే సహించరు. అదే విధంగా తన దరిదాపుల్లో ఎవరైనా దమ్ము కొట్టడం కంట పడితే వెంటనే వాళ్లను పిలిచి ‘‘ఇలా గప్పుగప్పున పొగ పీల్చుతున్నారే, దీని వల్ల మీకేదో అవుతోందన్న బాద లేకపోవచ్చు. పక్కనున్న మా లాంటి వారు రోగస్తులవుతాం’’ అంటూ లె ఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారట.
 
 అలాంటి త్రిషను ఏకంగా స్మోక్‌లోనే నర్తింపచేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తే ఈ ముద్దుగుమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అమ్మడు ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్ సరసన ఎన్నై అరిందాల్ చిత్రంలో నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో అజిత్, త్రిషపై దర్శక నిర్మాతలు ఒక సాంగ్‌ను చిత్రీకరించతలపెట్టారట. త్రిష కూడా క్యారవన్ వ్యాన్‌లో కూర్చొని అందంగా మేకప్ వేసుకుని సెట్‌లోకి వెళ్లగా అక్కడ అంతా పొగమయంగా ఉండటం చూసి షాక్ అయ్యారట. ఆ పొగలోనే హీరో అజిత్‌తోపాటు దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్ ఉన్నారు. అయితే త్రిష మాత్రం వెంటనే క్యారవన్ వ్యాన్‌పై పరిగెత్తి అలాంటి పొగ సెట్‌లో తాను నటించనని ఖరాఖండిగా చెప్పేశారట. పొగ అంటే తనకు అలర్జీ అని చెప్పిందట. కాదు కూడదూ నటించి తీరాలి అంటే రేపటి నుంచి మరో వారం రోజుల వరకు తాను షూటింగ్ చేయలేనని చెప్పేశారట. దీంతో చేసేదేమి లేక చిత్ర యూనిట్ స్మోకింగ్ ఎఫెక్ట్ లేకుండానే ఆ పాటను చిత్రీకరించారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement