పాటలతో కొత్త సంవత్సరంలోకి.. | Ajith's Yennai Arindhaal audio to release on New Year night | Sakshi
Sakshi News home page

పాటలతో కొత్త సంవత్సరంలోకి..

Published Mon, Dec 29 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

పాటలతో కొత్త సంవత్సరంలోకి..

పాటలతో కొత్త సంవత్సరంలోకి..

నూతన సంవత్సరం తొలిరోజున పాటలు, ప్రచార చిత్రాలతో పరిచయానికి సిద్ధం అవుతోంది ఎన్నైఅరిందాల్ చిత్రం. అజిత్ హీరోగా అనుష్క, త్రిష, పార్వతిమీనన్‌లు నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రంపై చాలా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌కు బ్రహ్మాండంగా స్పందన వచ్చింది. దీంతో చిత్రాని కంటేముందు పాటలు, ప్రచార చిత్రం కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
 వారిని సంతోషపరిచే వార్త ఏమిటంటే ఎన్నై అరిందాల్ చిత్ర గీతాలను, ప్రచార చిత్రాన్ని నూతన సంవత్సరం జనవరి తొలి రోజున విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం అధికారిక పూర్వంగా వెల్లడించారు. ఆయన తెలుపుతూ ఎన్నైఅరిందాల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఎన్నై అరిందాల్ అందరి అంచనాలను పూర్తి చేస్తుంది. అజిత్ అభిమానులను సంతృప్తి పరుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement