అజిత్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ | Actor Ajith film scripts Ready | Sakshi
Sakshi News home page

అజిత్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ

Published Sun, Oct 19 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

అజిత్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ

అజిత్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ

 నటుడు అజిత్‌ను అభిమానులు ‘తల’ అని పిలుచుకుంటారు. అలాంటి తల తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఆరంభం, వీరం చిత్రాల విజయాలతో యమజోరు మీదున్న అజి త్ తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. అజిత్ ఇంతకుముం దు నటించిన వీరం చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ సెంటిమెంట్‌తో ఇంకా పేరు నిర్ణయించని ఈ తాజా చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 ఇది అజిత్ నటిస్తున్న 55వ చిత్రం. కాగా 56వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం అయ్యిందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శివ. ఈయన ఇంతకుముందు అజిత్‌తో వీరం చిత్రం తెరకెక్కించారు. దర్శకుడు శివ మాట్లాడుతూ, అజిత్ కోసం తాజాగా సూపర్ కమర్షియల్ కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో అజిత్‌తోపాటు హాస్యపాత్రను సంతానం పోషించనున్నట్లు తెలి పారు. హీరోయిన్ కోసం పలువురు ప్రముఖ నటీమణులను పరిశీలించినట్లు చెప్పారు. అయితే ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని అన్నారు. చిత్ర షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని వెల్లడించా రు. కాగా ఈ చిత్రంలో నటి హన్సిక నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement