ఎన్నై అరిందాల్‌కు సీక్వెల్ చేస్తా | Naga Chaitanya Goes Back To Gautham Menon? | Sakshi
Sakshi News home page

ఎన్నై అరిందాల్‌కు సీక్వెల్ చేస్తా

Published Mon, Apr 27 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

ఎన్నై అరిందాల్‌కు సీక్వెల్ చేస్తా

ఎన్నై అరిందాల్‌కు సీక్వెల్ చేస్తా

ఎన్నై అరిందాల్‌కు సీక్వెల్ చేస్తానని ఆ చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ వెల్లడించారు. అజిత్, అనుష్క, త్రిష హీరో హీరోయిన్లుగా ఏఎం రత్నం నిర్మించిన భారీ చిత్రం ఎన్నై అరిందాల ఈ చిత్రం పెద్ద విజయాన్నే సాధించింది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపు తీస్తానంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్. మిన్నలే, కాక్కకాక్క, పచ్చైకిళి ముత్తుచ్చరం, విన్నై తాండి వరువాయా వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన మధ్యలో నటునిశినాయ్‌గళ్, నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రాలు అపజయాలతో కాస్త వెనుకబడ్డారు.
 
 అలాంటిది ఎన్నై అరిందాల్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో పడ్డారు. ప్రస్తుతం శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమైయడా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గౌతమ్‌మీనన్ త్వరలో ఎన్నై అరిందాల్-2 రూపొందిస్తానంటున్నారు. ఇటీవల ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక ఇంజినీరింగ్ విద్యార్థినైన తాను సినిమా దర్శకుడినయ్యానని తెలిపారు. తనచుట్టూ జరిగే సంఘటనలనే తాను సినిమాగా రూపొందిస్తున్నానని అన్నారు. నటుడు అజిత్ గురించి చెప్పండని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎన్నై అరిందాల్ -2 చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కిస్తానని అన్నారు. హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఆ చిత్రాన్ని అజిత్ హీరోగానే తెరకెక్కిస్తానని గౌతమ్‌మీనన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement