క్యాబిన్ లో పొగ.. వెనక్కిమళ్లిన ఢిల్లీ- మిలాన్ విమానం
న్యూఢిల్లీ: టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే క్యాబిన్ లో పొగ వ్యాపించడంతో ఢిల్లీ- మిలాన్ విమాన సర్వీసు అత్యవసరంగా వెనక్కిమళ్లింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..
ఢిల్లీ నుంచి మిలాన్(ఇటలీ)కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 137 షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టేకాఫ్ అయింది. విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే క్యాబిన్ లో పొగ వ్యాపించింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించిన పైలట్.. విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి ల్యాండ్ చేశాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ కూడా ప్రమాద సమాచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా ఈ సంఘటనలో ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ఆపదా కలగలేదు. మరికొద్ది గంటల్లోనే వేరొక విమానం ద్వానా ప్రయాణికులను మిలాన్ చేరవేస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.
Air India flt 137 Delhi to Milan which departd at 1500 hours has reportd smoke inside the cabin.Full emergency landing back at IGI.
— CP Delhi (@CPDelhi) January 26, 2016