వారికి కోట్లు.. వీరికి పాట్లు..! | brick klin pollution in arrmuru and velpuru villages | Sakshi
Sakshi News home page

వారికి కోట్లు.. వీరికి పాట్లు..!

Published Tue, Feb 9 2016 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

వారికి కోట్లు.. వీరికి పాట్లు..!

వారికి కోట్లు.. వీరికి పాట్లు..!

♦  రూ.కోట్లు గడిస్తున్న ఇటుక బట్టీల యజమానులు
♦  నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో 105 పైనే..
♦  బట్టీల్లో పొగచూరుతున్న బతుకులు
♦  వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాల్యం

 కలెక్టర్ స్పందిస్తేనే విముక్తి.. 
జిల్లాలో ఇటుక బట్టీలు విచ్చలవిడిగా వెలుస్తున్నారుు. అనుమతి లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీల్లో కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారు. వారు రోజు పనిచేస్తే ఒక్కో కూలీకి యజమానులు రూ.100 చెల్లించడం లేదు. ఇటుక బట్టీల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు పొగతో రోగాల పాలవుతున్నారు.. కార్మికశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.. ఇటుక బట్టీల వ్యవహారంపై ‘సాక్షి’ అందిస్తున్న స.హ.చట్ట కథనం..  - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్

 చిత్రంలో చూస్తున్న ఇటుక బట్టి ఆర్మూరు-వేల్పూరు   మండలాల శివారుల్లోని చేపూరు-లక్కోర గ్రామాల సరిహద్దుల్లోనిది. ఈ ఇటుక బట్టీల్లోని 3 యూనిట్లలో కాల్చే ఇటుకల నుంచి వెలుబడే పొగ దీనికి 100 మీటర్ల దూరంలో ఉన్న లక్కోర గ్రామాన్ని ప్రతి మూడు రోజులకొకసారి కమ్ముకుంటోంది. పొగను పీల్చడం వల్ల వృద్ధులు, యువకులు, పిల్లలు, అస్తమ, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారు.

 చిత్రంలో చూస్తున్న ఇటుక బట్టి బాల్కొండ  మండలం చిట్టాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా వెలిసిన వీవీఎస్ కంపెనీ వారివి. ఈ ఇటుక బట్టీల్లో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దినసరి కూలీ రూ.100 కూడా అందడం లేదు. అలాగే వీరి నివాసాలకు తగిన వసతులు లేవు. ఈ ఇటుక బట్టీపై అధికారులు తనిఖీలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి సహాయ కార్మిక కమిషనర్ల పరిధిలో 36 మండలాలు ఉన్నారుు. వీటి పరిధి లో 29 ఇటుక బట్టీలు కార్మికశాఖ అనుమతితో నడుస్తున్నాయి. కానీ, అనధికార సమాచారం ప్రకారం జిల్లాలో 105 వరకు ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలో తనిఖీలు చేసి కార్మిక శాఖ కేవలం రెండు కేసులే నమోదు చేసి రూ.10,300 జరి మానా విధించింది. కార్మికశాఖలో కొందరి అధికారుల తీరు వల్ల జిల్లాలో అనధికారికంగా బట్టీ లు నడుస్తున్నారుు. ఒక్క బాల్కొండ మండలంలోనే ఇత్వార్‌పేట్, బస్వాపూర్, చిట్టాపూర్, నా ల్గోర్ గ్రామాల్లో ఐదు ఇటుక బట్టీలు దర్జాగా న డిపిస్తున్నా కార్మికశా ఖ పట్టించుకోవడం లేదు. వేల్పూరు, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, మోర్తా డ్ మండలాల్లో పదుల సంఖ్యలో అనుమతులు లేకుండా నడుస్తున్నా ఇంతవరకు ఒక్క కేసు న మోదు కాలేదు. జిల్లాలో 75 ఇటుక బట్టీలు అధికారుల అనుమతి లేకుండా కార్మికుల శ్రమను దోచుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలకు సమీపంగా నడుస్తు ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్నాయి.

 ఇటుక బట్టీల్లో కార్మికుల శ్రమదోపిడీ
జిల్లాలో అధికారుల అనుమతితో, అనుమతి లే కుండా నడుస్తున్న ఇటుక బట్టీల్లో కార్మికులు వె ట్టిచాకిరీ చేస్తున్నారు. యజమానులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రా ష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇటుక బట్టీల్లో పని కోసం వస్తున్న కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఇతర రాష్ట్రాల కా ర్మికులు 1,700 వరకు ఉంటారని అధికార వర్గా లు పేర్కొంటున్నాయి. కేవలం లాభార్జనే ధ్యే యంగా పెట్టుకున్న యజమాన్యాలు వారి ప్రతి రక్తపు బొట్టును పీల్చి రూ.లక్షలు, రూ.కోట్లు గ డిస్తున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ రెట్టింపు ప నిభారాన్ని కార్మికులకు అంటగడుతున్నారు. ని వాసానికి తగిన వసతులు కూడా కల్పించడం లే దు. అయితే వారిని వెన్నుదన్నుగా నిలిచిన కా ర్మికుల బాగోగులను పర్యవేక్షిస్తూ వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన కార్మికశాఖ చోద్యం చూస్తోంది. గడిచిన నాలుగేళ్లలో కార్మికశాఖ బా న్సువాడ మండలంలోని కొయ్యగుట్టలో కార్మికు ల శ్రమదోపిడీపై ఒక్క కేసు నమోదు చేసిం దం టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు తనిఖీలు శూన్యం కార్మిక సంక్షే మం శూన్యం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

 అనారోగ్యం బారిన జనావాసాలు
జిల్లాలో ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపం గా వెలుస్తుండటంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చే పొగ వలన వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వేల్పూరు మం డలం లక్కోరా గ్రామానికి సమీప ఇటుక బట్టీ ఉండటంతో రోజు ఉదయం పూట కాల్చిన ఇటు కల నుంచి వచ్చే పొగను పీల్చడం  వలన చాలా మంది అస్తమ, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారు. అదే విధంగా డిచ్‌పల్లి మండలం నడ్‌పల్లి గ్రామ ప్రజలది ఇదే పరిస్థితి. ఈ విధం గా జిల్లాలో కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, నిజామాబాద్ డివిజన్ల పరిధిలోని చాలా మండలా ల్లో ఇటుక బట్టీల పొగను పీల్చుతూ రోగాల బా రిన పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసా ర్లు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించడం లేదు. జనావాసాలకు దగ్గరగా వెలుస్తున్న ఇటుక బట్టీలపై అనుమతి లేకుండా నడుస్తున్న ఇటుక బట్టీలపై కార్మిక శాఖ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement