brick kiln
-
ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బసిర్‌హత్‌లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! -
ఇటుక బట్టీ వద్ద విషాదం.. ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి
రాయ్‌పూర్: ఇటుకలు కాల్చేందుకు రాజేసిన అగ్గి చివరకు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇటుక బట్టీ వద్ద ఐదుగురు కార్మికులు ఊపిరి ఆడక మరణించిన దుర్ఘటన ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాసముంద్ జిల్లాలోని గంధ్‌ఫూలీగఢ్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక ఇటుకల బట్టీ కర్మాగారం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ఎండిన బురదమట్టి ఇటుకలను క్రమపద్ధతిలో పేర్చి వాటి అంతర్భాగంలో నిప్పుపెట్టి పైభాగంలో ఆరుగురు కార్మికులు నిద్రించారు. మిగతా కార్మికులు ఉదయం బట్టీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఆరుగురు చలనం లేకుండా పడిఉన్నారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా ఐదుగురు అంతకుముందే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విషపు పొగ పీల్చడంతో ఊపిరాడక మరణించారని భావిస్తున్నారు. చదవండి: సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరిస్తే డబ్బులు ఆఫర్ చేశాడు: గ్యాంగ్‌స్టర్ -
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు
ఆదిలాబాద్‌రూరల్: మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడుతున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఉంది. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, తలమడుగు, తాంసి, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఉట్నూర్ తదితర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా..వీటి నిర్వాహకులు గ్రామ పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారంలో 2 శాతం పన్ను చెల్లించాలని నిబంధనలు ఉన్నా..సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆదిలాబాద్‌రూరల్, మావలలోని మావల, కచికంటి, చించూఘాట్, అంకోలి, తంతోలి, యాపల్‌గూడ, అనుకుంట, బంగారిగూడ, బట్టిసావర్గాం, కచికంటి గ్రామపంచాయతీల శివారు పరిధిలో ఇటుక తయారీ బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా గ్రామ పంచాయతీ శివారుల్లో సుమారు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ఒక్క ఆదిలాబాద్‌రూరల్ మండలంలోనే వందకుపైగా బట్టీలు ఉండగా..మొత్తంగా 200 పైన ఉన్నాయి. ఏడాదిలో ప్రతీ బట్టీలోనూ దాదాపు లక్ష నుంచి పది లక్షల వరకు ఇటుకలు కాల్చి ఒక్కొక్కటి రూ.7 చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యాజమాని కనీసం ప్రతీ వేసవిలో 5 నుంచి 10 లక్షల వరకు ఇటుకలు విక్రయిస్తారు. వీటి ద్వారా సుమారు రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. కారణం..విక్రయ సమయంలో ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీరాజ్ యాక్టు ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2 శాతం పంచాయతీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి గండీ పడుతుంది. ప్రతీ ఇటుక బట్టీతో వ్యాపారులు లాభాలు అర్జిస్తుంటే పంచాయతీలకు మాత్రం పన్ను కట్టడం లేదు. బట్టీల నిర్వాహణకు పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలు ఉన్న వాటినీ పట్టించుకోవడం లేదు. పచ్చని పొలాల్లో..? భూ పరిరక్షణ చట్టం 129/12లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఇటుక బట్టీలు నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పంట భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు.రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. జిల్లా కేంద్రానికి కూత వేటులో దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా పంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి. ఇదిలా ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో సైతం ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అంతేకాకుండా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఇటుక బట్టీ వ్యాపారులు అటువైపు నుంచి ప్రవాహిస్తున్న వాగుల్లోనే ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అసలే ఖరీఫ్‌లో పంటల దిగుబడి రాకపోవడంతో రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పారుతున్న వాగుల నుంచి రబీ సాగుకు నీళ్లను అందిద్దామంటే యథేచ్ఛగా ఇటుక వ్యాపారులు వాగులకు మోటార్లు ఏర్పాటు చేసుకొని ఇటుకల తయారీకి వాడుకోవడంతో వాగుల నీళ్లు ఇంకిపోతున్నాయి. దీంతో పంటల సాగుకు నీళ్లు పూర్తి స్థాయిలో అందక పంటలు సైతం ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. గుట్టల నుంచి మట్టి తవ్వకాలు ఆయా మండలాల పరిధిలో ఇటుకల తయారీ కోసం కొంతమంది ఇటుక వ్యాపారులు ఏజెన్సీ ప్రాంతంలో ఇటుకల తయారీ కోసం ఏకంగా గుట్టల నుంచి మట్టి తవ్వి ఇటుకల తయారీ కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏపుగా పెరిగిన చెట్లను సైతం నరికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇటుక వెనుక కిటుకు
తిరుపతి రూరల్ మండలం రెవెన్యూ అధికారులు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, వాగులు, వంకలను అక్రమార్కులకు దోచిపెట్టడంలోనే కాదు...అక్రమార్కులతో బలమైన ఇటుక బంధం సైతం ఏర్పాటు చేసుకుంటున్నారా? ఇళ్ల పక్కనే కాలుష్యం వెదజల్లుతున్న ఇటుక బట్టీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? అనుమతి లేని బట్టీపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారా? కాసుల మత్తులో జోగుతున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు తిరుపతి రూరల్ మండల ప్రజలు. అక్రమ ఇటుక బట్టీపై ప్రేమ చూపుతున్న అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి పంచాయతీలో ఏఆర్‌బీ పేరుతో అధికార పార్టీకి చెందిన స్థానిక చోట నాయకుడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ నిర్వహిస్తున్నాడు. బట్టీ ఏర్పాటులో నిబంధనలకు పాతర వేశాడు. ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా వ్యవసాయ భూమిలో ఇటుక బట్టీ నిర్వహించకూడదు. అదీ ఇళ్ల పక్కనే లక్షల సంఖ్యలో ఇటుకలను తయారు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బొగ్గు, వరి పొట్టును డంపింగ్ చేశారు. ఇళ్ల పక్కనే బట్టీ ఉండకూడదని జీవోలు చెపుతున్నా అధికార అండతో సదరు బట్టీ నిర్వాహకులు చెలరెగిపోతున్నారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులు.. ఏఆర్‌బీ ఇటుక బట్టీ కోసం భారీ ఎత్తున డంపింగ్ చేసిన బొగ్గు, వరి పొట్టు, బట్టీని కాల్చడం వల్ల వచ్చే కాలుష్యంతో తీవ్ర శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని పలుమార్లు ఎస్వీనగర్ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జనచైతన్య లేఅవుట్లో ఉండేవారు అయితే జన్మభూమి సభల్లోనూ తహసీల్దార్‌తో పాటు అధికారులను నిలదీశారు. కాలుష్యం నుంచి మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు. రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. పట్టిం చుకోవాల్సిన తహసీల్దార్ రాజగోపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్‌ను కలిసి ఆయనపైన కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కదలిక... అనుమతి లేకుండా, అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీ వల్ల ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందిం చడం లేదని కలెక్టర్ ప్రద్యుమ్న తహసీల్దార్‌ను నిలదీశారు. దీంతో బట్టీని సందర్శించి, ఇళ్ల పక్కనే ఉన్నట్లు నిర్ధారించారు. ల్యాండ్ కన్వర్షన్ జరగకుండా దొంగదారిలో బట్టీని కాల్చుతున్నారని నివేదికను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం లేని బట్టీని ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని మండల మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఇరువర్గాలను విచారించారు. అనంతరం బట్టీని క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు విర్రవీగుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికా రం మాది....మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు... అంటూ జబ్బలు చరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న బట్టీని మూసివేయాలని కోరుతున్నారు. -
ఆ బట్టీ యాజమానులపై చర్యలు తీసుకోండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయని బట్టీ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పిం ది. ఈ విషయంలో వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఫలితం ఉండదని, వారిపై తీసుకున్న చర్యలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా విచారణ చేపట్టింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిస్సా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు విచారణ చేపట్టడం మేలని భావించి, వ్యాజ్యాన్ని ఒడిస్సా, ఉమ్మడి హైకోర్టులకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపిం ది. వేతనాలను కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయని బట్టీ యజమానులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. వారికి నోటీసులిస్తున్నామని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు చెప్పగా, నోటీసులతో ఒరిగేదేముందని ధర్మాసనం నిలదీసింది. వారిపై తీసుకున్న చర్యలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
బట్టీల్లో బాల్యం
♦ బుగ్గి అవుతున్న భవిష్యత్తు ♦ పెద్దలతో పాటే పిల్లలూ పనుల్లో.. ♦ యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ ♦ చోద్యం చూస్తున్న అధికారులు ♦ యథేచ్ఛగా విద్యుత్ వినియోగం మెదక్ : ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతోంది. బాలల హక్కుల చట్టం ప్రకారం వారిని కాపాడి, ఇటుక బట్టీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇటుక బట్టీల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. జిలాల్లో వందలాది ఇటుక బట్టీలు వెలిశాయి. ఈ బట్టీల్లో వేలాది మంది బాలకార్మికులలు పనులు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తుంటారు. దీంతో కార్మికులతో పాటు వారిపిల్లలు సైతం బట్టీల్లో పనులు చేయాల్సిందే. ఇంత తతంగం అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, పట్టించుకున్న పాపానపోవటంలేదు. అంతేకాకుండా రైతాంగం అబివృద్ధి కోసం ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇస్తే దాన్ని సైతం బట్టీలకు వాడుకుంటూ ట్రాన్స్‌కోను నిలువునా ముంచుతున్నారు. కలపను విచ్చలవిడిగా బట్టీలకింద కాల్చటం, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వ్యవసాయపొలాల్లో బట్టీలు నిర్వహిస్తూ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ బట్టీలను రోడ్లపక్కనే ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు కళ్లలో దుమ్ముధూళిపడి అనేక ఇబందులు పడుతున్నారు. తరుచూరోడ్డు ప్రమాదాలకు గురికావల్సి వస్తోంది. బట్టీలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇందుకోసం కొంత డబ్బును చలాన్‌రూపంలో చెల్లించాలి. అలాగే నీటిని వాడుకోవటానికి విద్యుత్తు శాఖకు రూ. 10వేల డిడిని చెల్లించాలి. బట్టీల కిందకు కలపను ఎక్కడినుండి సమకూర్చుకునే విషయమై ముందుగానే ఫారెస్టుఅధికారుల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా బట్టీల్లో 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు. ఇన్నిరకాల అనుమతులు పొందాకనే బట్టీలను నిర్వహించాలి. కానీ జిల్లాలో నిర్వహించిన వందలాది బట్టీల్లో ఎక్కువశాతం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో గంగాపూర్, తొడిట, పిల్లికొటాల్, హవేళిఘణపూర్, శివారుల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో వందలాది మంది బాలకార్మికులు పనులు చేస్తున్నారు. వీరి కోసమైనా ప్రత్యేకం గా బడులు ప్రారంభించాల్సి ఉంది. అధికారి వివరణ: ఈ విషయంపై ఎంఈఓ నరేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. రోజుకు రూ.400 నుంచి 500 సంపాదిస్తున్నాం మాది మహరాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం. నెల క్రితం ఇటుకలు చేసేందుకు మెదక్ మండలం రాయిన్‌చెర్వు గ్రామానికి భార్యపిల్లలను వెంటతీసుకొని వచ్చాం. రోజుకు సుమారు 1000 ఇటుకలు తయారు చేస్తున్నాం. ఇందుకు మాకు రూ.400 నుండి 500ల వరకు వస్తుంది - దశరథం, నాందేడ్. పనిచేసేచోట బడులు లేవు పొట్ట చేతబట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చాం. ఇక్కడ పనిచేసేచోట పాఠశాలలు ఏర్పాటుచేసి మాలాంటి వారి పిల్లలకు చదువులు చెప్పిస్తారట. కాని ఇక్కడ అలాంటివేవి అందుబాటులోలేవు. మా పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. - లక్ష్మణ్, నాందేడ్ మా రాష్ట్రంలో పని దొరకడంలేదు.. మా సొంతరాష్ట్రంలో ఏం పనులు దొరకడం లేదు. దీంతో ఇక్కడకు వచ్చాం. పనిచేసేచోటనే చిన్నపాటి గుడిసెలు వేసుకొని పనులు చేస్తున్నాము. నాతోపాటు నాభర్త, పిల్లలు ఉన్నారు. - శ్యామ్‌బాయి, నాందేడ్ -
వారికి కోట్లు.. వీరికి పాట్లు..!
♦ రూ.కోట్లు గడిస్తున్న ఇటుక బట్టీల యజమానులు ♦ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో 105 పైనే.. ♦ బట్టీల్లో పొగచూరుతున్న బతుకులు ♦ వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాల్యం కలెక్టర్ స్పందిస్తేనే విముక్తి.. జిల్లాలో ఇటుక బట్టీలు విచ్చలవిడిగా వెలుస్తున్నారుు. అనుమతి లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీల్లో కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారు. వారు రోజు పనిచేస్తే ఒక్కో కూలీకి యజమానులు రూ.100 చెల్లించడం లేదు. ఇటుక బట్టీల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు పొగతో రోగాల పాలవుతున్నారు.. కార్మికశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.. ఇటుక బట్టీల వ్యవహారంపై ‘సాక్షి’ అందిస్తున్న స.హ.చట్ట కథనం.. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ చిత్రంలో చూస్తున్న ఇటుక బట్టి ఆర్మూరు-వేల్పూరు మండలాల శివారుల్లోని చేపూరు-లక్కోర గ్రామాల సరిహద్దుల్లోనిది. ఈ ఇటుక బట్టీల్లోని 3 యూనిట్లలో కాల్చే ఇటుకల నుంచి వెలుబడే పొగ దీనికి 100 మీటర్ల దూరంలో ఉన్న లక్కోర గ్రామాన్ని ప్రతి మూడు రోజులకొకసారి కమ్ముకుంటోంది. పొగను పీల్చడం వల్ల వృద్ధులు, యువకులు, పిల్లలు, అస్తమ, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారు. చిత్రంలో చూస్తున్న ఇటుక బట్టి బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా వెలిసిన వీవీఎస్ కంపెనీ వారివి. ఈ ఇటుక బట్టీల్లో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దినసరి కూలీ రూ.100 కూడా అందడం లేదు. అలాగే వీరి నివాసాలకు తగిన వసతులు లేవు. ఈ ఇటుక బట్టీపై అధికారులు తనిఖీలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి సహాయ కార్మిక కమిషనర్ల పరిధిలో 36 మండలాలు ఉన్నారుు. వీటి పరిధి లో 29 ఇటుక బట్టీలు కార్మికశాఖ అనుమతితో నడుస్తున్నాయి. కానీ, అనధికార సమాచారం ప్రకారం జిల్లాలో 105 వరకు ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలో తనిఖీలు చేసి కార్మిక శాఖ కేవలం రెండు కేసులే నమోదు చేసి రూ.10,300 జరి మానా విధించింది. కార్మికశాఖలో కొందరి అధికారుల తీరు వల్ల జిల్లాలో అనధికారికంగా బట్టీ లు నడుస్తున్నారుు. ఒక్క బాల్కొండ మండలంలోనే ఇత్వార్‌పేట్, బస్వాపూర్, చిట్టాపూర్, నా ల్గోర్ గ్రామాల్లో ఐదు ఇటుక బట్టీలు దర్జాగా న డిపిస్తున్నా కార్మికశా ఖ పట్టించుకోవడం లేదు. వేల్పూరు, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, మోర్తా డ్ మండలాల్లో పదుల సంఖ్యలో అనుమతులు లేకుండా నడుస్తున్నా ఇంతవరకు ఒక్క కేసు న మోదు కాలేదు. జిల్లాలో 75 ఇటుక బట్టీలు అధికారుల అనుమతి లేకుండా కార్మికుల శ్రమను దోచుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలకు సమీపంగా నడుస్తు ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్నాయి. ఇటుక బట్టీల్లో కార్మికుల శ్రమదోపిడీ జిల్లాలో అధికారుల అనుమతితో, అనుమతి లే కుండా నడుస్తున్న ఇటుక బట్టీల్లో కార్మికులు వె ట్టిచాకిరీ చేస్తున్నారు. యజమానులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రా ష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇటుక బట్టీల్లో పని కోసం వస్తున్న కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఇతర రాష్ట్రాల కా ర్మికులు 1,700 వరకు ఉంటారని అధికార వర్గా లు పేర్కొంటున్నాయి. కేవలం లాభార్జనే ధ్యే యంగా పెట్టుకున్న యజమాన్యాలు వారి ప్రతి రక్తపు బొట్టును పీల్చి రూ.లక్షలు, రూ.కోట్లు గ డిస్తున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ రెట్టింపు ప నిభారాన్ని కార్మికులకు అంటగడుతున్నారు. ని వాసానికి తగిన వసతులు కూడా కల్పించడం లే దు. అయితే వారిని వెన్నుదన్నుగా నిలిచిన కా ర్మికుల బాగోగులను పర్యవేక్షిస్తూ వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన కార్మికశాఖ చోద్యం చూస్తోంది. గడిచిన నాలుగేళ్లలో కార్మికశాఖ బా న్సువాడ మండలంలోని కొయ్యగుట్టలో కార్మికు ల శ్రమదోపిడీపై ఒక్క కేసు నమోదు చేసిం దం టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు తనిఖీలు శూన్యం కార్మిక సంక్షే మం శూన్యం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. అనారోగ్యం బారిన జనావాసాలు జిల్లాలో ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపం గా వెలుస్తుండటంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చే పొగ వలన వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వేల్పూరు మం డలం లక్కోరా గ్రామానికి సమీప ఇటుక బట్టీ ఉండటంతో రోజు ఉదయం పూట కాల్చిన ఇటు కల నుంచి వచ్చే పొగను పీల్చడం వలన చాలా మంది అస్తమ, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారు. అదే విధంగా డిచ్పల్లి మండలం నడ్పల్లి గ్రామ ప్రజలది ఇదే పరిస్థితి. ఈ విధం గా జిల్లాలో కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, నిజామాబాద్ డివిజన్ల పరిధిలోని చాలా మండలా ల్లో ఇటుక బట్టీల పొగను పీల్చుతూ రోగాల బా రిన పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసా ర్లు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించడం లేదు. జనావాసాలకు దగ్గరగా వెలుస్తున్న ఇటుక బట్టీలపై అనుమతి లేకుండా నడుస్తున్న ఇటుక బట్టీలపై కార్మిక శాఖ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. -
ఇటుకబట్టీలో మహిళ మృతి
కందుకూరు : బతుకు తెరువు కోసం ఇటుకబట్టీలో చేరితే ఆ బట్టీనే ఆమె ప్రాణం తీసింది. ఉపాధి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన లలిత(60) అనే మహిళ గత కొంత కాలంగా ఇటుకబట్టీలో పనిచేస్తుంది. రోజూ మాదిరే ఆమె బుధవారం బట్టీలో పనిచేసుకుంటుండగా రివర్స్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. -
బట్టీల వద్దే బడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటుకబట్టీ కార్మికుల పిల్లల కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్మికుల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యనందించేందుకు కొత్తగా ‘పని వద్దకే పాఠశాల’ పేరుతో బడులు చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ బడుల్లో పిల్లలకు మాతృభాషలోనే బోధన చేపట్టనున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మెరుగైన సౌకర్యాలతో ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా రాజీవ్ విద్యామిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం 119 పాఠశాలలను ప్రారంభించనున్నారు. అవ సరం మేరకు ఈ సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 30 మందికి ఒక టీచర్ ప్రస్తుతం జిల్లాలో దాదాపు 430 ఇటుకబట్టీలున్నట్లు కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ బట్టీల వద్ద దాదాపు మూడున్నరవేల మంది పిల్లలున్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. దీంతో ముప్పై మంది పిల్లలకు ఒక పాఠశాలను ప్రారంభించేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో పాఠ శాలకు ఒక టీచర్‌ను నియమించనున్నారు. బట్టీల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఒరియా భాషలో బోధించే టీచర్లనే ఎంపిక చేస్తున్నారు. ఈ బాధ్యతను ఆర్వీఎం అధికారులు మూడు ఎన్జీఓలకు అప్పగించారు. ఉచిత స్టడీ మెటీరియల్ ఈ పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను రాజీవ్ విద్యామిషన్ అధికారులు అందజేయనున్నారు. సోమవారం మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో కొందరికి నామమాత్రంగా మెటీరియల్ పంపిణీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈనెల 30న పిల్లలందరికీ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఒడిశా రాజ్యసభ సభ్యుడు జెపాండా హాజరుకానున్నారు. మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేసేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాఠశాలల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.