
శంషాబాద్ విమానాశ్రయం(ఫైల్)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శంషాబాద్ నుంచి మంగళూరు, భువనేశ్వర్, ముంబై, కువైట్ కు వెళ్లాల్సిన విమానాలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేశారు.
మరోవైపు వాయుగుండం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో వెలుతురు మందగించింది. విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.