![ఏటా 70 లక్షల ప్రాణాలను తీస్తున్న వాయుకాలుష్యం](/styles/webp/s3/article_images/2017/09/2/71372286979_625x300.jpg.webp?itok=nGubET4f)
ఏటా 70 లక్షల ప్రాణాలను తీస్తున్న వాయుకాలుష్యం
వాయు కాలుష్యమే కదా కొంత జలుబూ, కాసిని తుమ్ములు తుమ్మేస్తే సరిపోతుందిలే అనుకోకండి. వాయుకాలుష్యం ఆయువు లాగేస్తుంది. ప్రాణాలు తీసేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2012 లో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల ప్రాణాలను తీసింది వాయుకాలుష్య భూతం. ఈ మరణాల్లో 80 శాతం పక్షవాతం, గుండెపోటు వల్ల వచ్చినవే. అంతేకాదు. ఆసియా ఖండం, ముఖ్యంగా ఆగ్నేయాసియా లో వాయుకాలుష్య మరణాలు చాలా ఎక్కువ. ఇవే కాక బొగ్గు, వంటచెరుకుల నుంచి వెలువడే పొగ కూడా ప్రాణాలు తీస్తోందని నివేదిక తెలిపింది.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. 2008 లో వాయు కాలుష్యం, పొగ వల్ల ౩౩ లక్షల మంది చనిపోయారు. మూడంటే మూడేళ్లలో ఇది రెండింతలైంది.