world health organisation
-
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
World Food Safety Day 2023: కలుషితాహారానికి 4.2 లక్షల మంది బలి!
ఆహారం బాగుంటే అది మనకు జవసత్వాలనిస్తుంది. అది కలుషితమైతే మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది.. ఒక్కోసారి ప్రాణాన్నే తీస్తుంది! అందుకని, మనకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి. ఆహార భద్రతలో దీని పాత్ర కీలకం. అంతే కాదు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది దాదాపు 200 రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, యువతే. ఇందులో ప్రతి ఏటా 4 లక్షల 20 వేల మంది చనిపోతున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాలను నివారించవచ్చు. అందుకే, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి 10 మందిలో ఒకరు! ►ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పేద, ధనిక అని తేడా లేదు. అన్ని దేశాల్లోనూ ఆహార నాణ్యతా సమస్యలు తలెత్తుతున్నాయి. ►బాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా భార లోహాలు వంటి రసాయన పదార్థాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులైన పిల్లలు జనాభాలో 9 శాతం ఉన్నారు, అయితే, ఆహార వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది వీరే. ► అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తే.. అవి అందరి ప్రాణాలనే కాదు, అనేకమంది జీవనోపాధిని కూడా కాపాడతాయి. ►వినియోగదారులను రక్షించడంలో, ఆహారోత్పత్తిపై విశ్వాసాన్ని కలిగించడంలో ఆహార భద్రతా ప్రమాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ► ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా 1963లో ఏర్పాటైన కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్.. గత 60 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ►236 ప్రమాణాలు, 84 మార్గదర్శకాలు, 56 ఆచరణాత్మక నియమాలు ఉన్నాయి. ఆహారంలో కలుషితాల గరిష్ట స్థాయికి సంబంధించిన 126 ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. వీటితో పాటు.. ఆహారోత్పత్తుల తయారీ ప్రక్రియలో కలిపే పదార్థాలకు సంబంధించి.. పురుగుమందుల అవశేషాలు, పశువైద్యంలో వాడే ఔషధాల అవశేషాల గరిష్ట స్థాయిలకు సంబంధించిన 10 వేలకు పైగా పరిమాణాత్మక ప్రమాణాలను కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ నిర్దేశిస్తోంది. ►పశువైద్యంలో ఉపయోగించే యాంటీమైక్రోబయల్ ఔషధాలకు లొంగని మొండి సూక్ష్మక్రిములతో సోకే ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ మరణాలను తగ్గించేందుకు కూడా ఆహార భద్రతా ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. 2016 నుంచి 50 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ► సురక్షితమైన, పోషకవంతమైన ఆహారం మేధో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడుతుంది. ►ఐరాస నిర్దేశిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార భద్రతా ప్రమాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్! ఇప్పటికే 9 మంది మృతి.. లక్షణాలివే!
లండన్: మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్ వచ్చిపడింది. మార్బర్గ్ వైరస్ డిసీస్ (ఎంవీడీ)గా పిలిచే దీని తాలూకు తొలి కేసు గత వారంలో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి దీని లక్షణాలు. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది. ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌కు ఇప్పటిదాకా చికిత్సేమీ లేదు! గినియాలోని కీటెం ప్రావిన్స్‌లో దీని బారిన పడి అప్పుడే 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘వారందరిలోనూ గుర్తు తెలియని హెమరేజ్ జ్వరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా మార్బర్గ్ సోకినట్టు అనుమానమున్న 200పై చిలుకు మందిని క్వారెంటైన్ చేశారు’’ అని వెల్లడించింది. దాంతో పొరుగునున్న కామెరూన్ సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత పెంచింది. ఏమిటీ వ్యాధి? ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. దీనిబారిన పడ్డవారిలో ఏకంగా 88 శాతం మంది మృత్యువాత పడుతున్నారు! 1967లో జర్మనీ, సెర్బియాల్లో ఎంవీడీ ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకినట్టు అప్పట్లో తేల్చారు. గబ్బిలాల వంటివాటికి ఆవాసమైన గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్ సోకుతుంది. పైగా ఇది అంటువ్యాధి కూడా. ఒకరి నుంచి మరొకరికి సులువుగా, అతి వేగంగా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, ఆయాసంతో మొదలై మూడో నాటికల్లా పొత్తి కడుపు నొప్పి, విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి. కళ్లన్నీ లోపలికి పోయి, మనిషి పీక్కుపోయి అచ్చు దెయ్యాన్ని తలపిస్తాడు. కేంద్ర నాడీవ్యవస్థ పనితీరు కూడా బాగా మందగిస్తుంది. చికిత్స లేదు దీనికి ఇప్పటిదాకా మందు గానీ, వ్యాక్సీన్ గానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇదమిత్థంగా చికిత్స కూడా లేదనే చెప్పాలి. అసలు తొలి దశలో ఎంవీడీని గుర్తించడం కూడా చాలా కష్టం. -
ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరం ఏదంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ నగరాల్లో వాయునాణ్యతను పరిశీలించి స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ తయారు చేసే జాబితాలో అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు( క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్– 2021 తెలిపింది. జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్ మాటర్ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది. కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. భారత్ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరిందని నివేదిక తెలిపింది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో దేశ వాయునాణ్యత మెరుగైందని, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయిందని పేర్కొంది. దేశంలో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటిందని తెలిపింది. చదవండి: (రసాయన దాడి ఖాయం: బైడెన్) పది మనవే.. ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. తర్వాత స్థానాల్లో యూపీకి చెందిన ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్పూర్, పాక్‌లోని ఫైసలాబాద్ నిలిచాయి. దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాక్, తజికిస్తాన్, ఇండియా ఉన్నాయి. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్ తదితరాలకు దారితీస్తుంది. చదవండి: (మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) నాలుగో స్థానంలో హైదరాబాద్ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక 2021 ప్రకారం భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్ ఉండగా, 2021కి 39.4కు పెరిగినట్లు నివేదిక తెలిపింది. నగరంలో వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రత్యేక కారణాలను నివేదిక పేర్కొనలేదు. కానీ పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి. ఈ నివేదిక ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ మేనేజర్ అవినాశ్ వ్యాఖ్యానించారు. దేశీయ వాహన విక్రయాలు పెరుగుతూ పోతున్న తరుణంలో దేశ వాయు నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. -
అదొక అంతులేని ఆత్మహత్యల నగరం
సాక్షి, న్యూఢిల్లీ : మెక్సికోలో గత దశాబ్దం నుంచి ప్రపంచంలోకెల్లా ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. దేశంలోని మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను, నేరస్థుల ముఠాలను అణచివేసేందుకు గత 12 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగానే హత్యలు పెరిగాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే ఆ దేశంలో 30 వేల హత్యలు చోటు చేసుకున్నాయి. 2018, మే నెల గత 20 ఏళ్లలో అత్యంత రక్తపాత మాసంగా చరిత్రకెక్కింది. ఆ నెలలో సరాసరి రోజుకు 90 హత్యలు జరిగినట్లు మెక్సికో హోంశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి. గత జూలై నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కువ మంది హత్యలకు గురయ్యారు. వారిలో రాజకీయ నాయకులతోపాటు 136 మంది పోలీసులు ఉన్నారు. 43 మంది విద్యార్థి టీచర్లు అదృశ్యమయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనిమిది మంది జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. తీవ్రమైన హత్యాకాండ, హింసాకాండ పరిస్థితులను తట్టుకోలేక ఇప్పుడు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర మెక్సికో నుంచి తాజాగా అందిన ఓ నివేదిక తెలియజేసింది. జ్వారెజ్ నగరంలోని ఓ వీధి అమెరికా సరిహద్దుకు ఆనుకొని ఉన్న మెక్సికో నగరం స్యూడడ్ జ్వారెజ్ ప్రపంచంలోనే అత్యంత భయానక నగరంగా పేరుగాంచింది. అక్కడ ఒక్క 2010లోనే ప్రతి లక్ష మందిలో 229 మంది హత్యకు గురయ్యారు. ఇది లాటిన్ అమెరికాలో జరిగే హత్యలకన్నా 14 రెట్లు, ప్రపంచ సగటు హత్యలకన్నా 38 రెట్లు ఎక్కువ. ఈ నగరంలో ప్రస్తుతం వారానికి 70 మంది స్థానికులు హత్యలకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో జ్వారెజ్లో హత్యలు తగ్గుముఖం పట్టగా ఆత్మహత్యలు పెరగడం విచారకరం. జ్వారెజ్ సిటీ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి రోజు 18 ఏళ్లు దాటిన 33 మంది నగరవాసులు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారట. 43 మంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. గతేడాది దాదాపు 12 వేల మంది ఆత్మహత్యలకు ప్రయత్నించారట. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల కోసం సామూహిక సమాధులకు ఏర్పాట్లు అటు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు సంబంధించి, ఇటు వివిధ రకాల నేరాలకు సంబంధించి జరుగుతున్న దారుణ హత్యల ప్రభావం కారణంగానే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. జ్వారెజ్ నగరాన్ని ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ హత్యలు జరిగే నగరంగా పిలవగా ఇప్పుడు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్న నగరంగా పిలుస్తున్నారు. -
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం..
-
డబ్ల్యూహెచ్ఓ అంబాసిడర్‌గా మిల్కాసింగ్
న్యూఢిల్లీ: ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కాసింగ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గుర్తింపు ఇస్తున్నట్లు పేర్కొంది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆయన.. ఈ ప్రాంతంలో అసంక్రామిక వ్యాధులను క్రీడలు, వ్యాయామాల ద్వారా తగ్గించే కార్యాచరణలో పాల్గొంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించేందుకు క్రీడలు, వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయనేందుకు 80 ఏళ్ల మిల్కాసింగ్ ఒక మంచి ఉదాహరణ అని సంస్థ పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో అసంక్రామిక వ్యాధుల కారణంగా ఏటా 8.5 మిలియన్ల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. రోజువారీ వ్యాయామాల ద్వారా వ్యాధులను అరికట్టడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటిని రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలోని 70 శాతం బాలురు, 80 శాతం బాలికలు ఎటువంటి ఆటలు, శారీరక వ్యాయామాలు చేయటం లేదని వివరించింది. 80 ఏళ్ల వయస్సుల్లోనూ ఆయన పరుగులో చురుగ్గా పాల్గొంటున్నారని మిల్కాసింగ్‌ను కొనియాడింది. ఆయన కృషితో ఈ ప్రాంతంలో వ్యాయామాలు, ఆటలపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆట స్థలాల అభివృద్ధి, పౌరులు వ్యాయామం చేసుకునేందుకు, ఆటలు ఆడుకునేందుకు తగిన పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వాలను కోరనున్నట్లు వెల్లడించింది. -
వామ్మో వైరస్! ఒలింపిక్స్ వాయిదా వేయండి!
వాషింగ్టన్: బ్రెజిల్లో జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి లేదా వేరోచోటుకి తరలించాలని 100 మందికిపైగా ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. 'జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా విజృంభిస్తుండటంతో తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 'ప్రపంచ ఆరోగ్యంపై ఆందోళనతోనే మేం ఈ లేఖ రాస్తున్నాం. బ్రెజిల్లో విశ్వక్రీడల వల్ల సైన్స్ గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో జికా వైరస్ విజృంభించే అవకాశముంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఒలింపిక్స్ క్రీడలను రద్దు చేయడం లేదా వేరేచోటుకు మార్చడం వల్ల అంతర్జాతీయంగా జికా వైరస్ వ్యాప్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని తమ ప్రాథమిక పరిశోధనలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. -
'పల్స్‌పోలియో' విజయవంతానికి ఏర్పాట్లు
రిమ్స్‌క్యాంపస్: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా చుక్కలు వేస్తారని చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 27,48,177 మంది జనాభా ఉన్నారని, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,42,897 మంది ఉన్నట్టు చెప్పారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1606 కేంద్రాలు, సంచార కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. పోలియో వ్యాక్సిన్, బ్యానర్ల పంపిణీ 95 శాతం పూర్తయ్యిందన్నారు. హై రిస్క్ ఏరియాను కూడా కవర్ చేసినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ : 08942-229945 నంబరులో వైద్యశాఖాధికారిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారుల సెల్ : 9963994336, 9963994337 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాలో పోలియో సమస్యాత్మాక ప్రాంతాల్లో 5,739 మంది బాలబాలికలను గుర్తించినట్టు చెప్పారు. వారికి చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాలకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఏడీఎం సీహెచ్ శారద, తదితరులు పాల్గొన్నారు. -
'ఎబోలా' మరింత విస్తృతమయ్యే అవకాశం
పశ్చిమాఫ్రికాను వణుకుపుట్టిస్తున్న ప్రాణాంతకమైన వైరస్ ఎబోలా. ఈ వ్యాధి మరింత విజృంభించే అవకాశాలున్నట్టు వాషింగ్టన్ పరిశోధకులు తమ పరిశోధనలో వెల్లడించారు. మే నెల నుంచి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 5వేల మంది బలైనట్టు ఇప్పటికే రుజువైందని, ఇది మరింత తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాప్తిచెందే అవకాశముందని పరిశోధక విభాగం హెచ్చరిస్తోంది. ఇటీవల వైరస్ వ్యాప్తి పెరడంతో మరణాల రేటు 70 శాతానికి చేరినట్టు ఓ కొత్త విశ్లేషణ సూచిస్తోంది. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎబోలా మరణాల రేటు 50 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరానికి ప్రభావిత ప్రాంతాల్లో ఎబోలా బాధితుల సంఖ్య పది లక్షలు దాటే అవకాశమున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఎబోలా వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
'80 శాతం పోలియో కేసులు పాక్‌లోనే'
ఇస్లామాబాద్: ప్రపంచంలో 80 శాతం పోలియో కేసులు పాకిస్థాన్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిపై ప్రగతి నివేదికను డబ్ల్యూహెచ్‌వో ఇక్కడ విడుదల చేసింది. దేశంలో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తీవ్రవాదులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలియో నిర్మూలన కోసం పాటుపడుతున్న ప్రచారకర్తలను తీవ్రవాదులు అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ లో ఈ పరిస్థితి అధికంగా ఉందని తెలిపింది. దీంతో పాకిస్థాన్‌లో పోలియో కేసులు ఉద్ధృతమవుతున్నాయి. -
‘పొగ’పై పోరాటం
సాక్షి, ముంబై: పొగాకు వాడకంపై డబ్బావాలాలు యుద్ధం ప్రకటించనున్నారు. ఈ మేరకు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తే జరిగే అనర్థాలను వారు నగరమంతా ప్రచారం చేయనున్నారు. ‘వరల్డ్ నో టొబాకో డే’ను పురస్కరించుకొని నగర డబ్బావాలాలు కేవలం భోజనం సరఫరా చేయడమేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ట్యాగ్‌లతో నగర వాసులకు సందేశాన్ని అందించనున్నారు. ‘జీవితం ఎంతో విలువైంది’, ‘పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మీ ఆయుష్షును ఇంకా తగ్గించుకోకండి’, ‘ధూమపానమైనా మానుకోండి లేదా మీ జీవితంపై ఆశలైనా వదులుకోండి’... తదితర ట్యాగ్‌లతో నగర వాసులకు సందేశాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. సలామ్ బాంబే ఫౌండేషన్ (ఎస్బీఎఫ్), బజాజ్ ఎలక్ట్రికల్స్ సంయుక్తంగా ‘టొబాకో ఫ్రీ ఇండియా’ సందేశాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా తమ వద్దకు వచ్చే వినియోగదారులకు కూడా ధూమపానం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్బీఎఫ్ ప్రముఖురాలు అదితి పరిఖ్ మాట్లాడుతూ.. ‘పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. అందుకే పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన సమాచారం వివరించేందుకు డబ్బావాలాల సహకారం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. చాలా మంది డబ్బావాలాలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యారని అన్నారు. ఈ సందేశం ముంబైకర్లతోపాటు కూడా వీరిలో కూడా అవగాహన కల్పిస్తుందని పరిఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా భోజనం సరఫరా చేసే దాదాపు 1,200 మంది డబ్బావాలాలు ఈ సందేశాన్ని ముంబైకర్లకు అందించనున్నారు. ఆరు ప్రాంతాల్లో భోజనం సరఫరా చేసే డబ్బావాలాలను, అదేవిధంగా అంధేరి, దాదర్, లోయర్‌పరేల్, చర్నీరోడ్, మెరైన్‌లైన్స్, చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్లను ఎంచుకున్నామని నిర్వాహకులు తెలిపారు. దీని కోసం డబ్బావాలాలు భోజనాన్ని అందించేందుకు వెళ్లినప్పుడు పలు సందేశాలతో కూడిన బ్యాడ్జీలు, టీ-షర్టులు ధరించనున్నారు. ఇదిలా వుండగా పొగాకు ఉత్పత్తులను రెండుగా వర్గీకరించారు. సిగరెట్, బీడీలను పొగ తాగేందుకు ఉపయోగిస్తుండడం తెలిసిందే. స్మోక్ ఫ్రీ ఉత్పత్తులుగా ఖైనీ, మావా, గుట్కా, పాన్‌మసాలాను పరిగణిస్తారు. మనదేశంలో పొగాకు ఉపయోగించేవాళ్లు 27.5 కోట్ల మంది ఉండగా, ఇందులో 25.9 శాతం మంది స్మోక్లెస్ టొబాకో సేవించగా, 5.7 శాతం మంది సిగరెట్లు, 9.2 శాతం మంది బీడీలను సేవిస్తున్నారని తేలింది. ‘పొగాకుపై పన్ను పెంచాలి’ ముంబై: ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల చాలా మంది నష్టపోతున్నందున, దీని వినియోగాన్ని తగ్గించడానికి పన్నులు అధికం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. అన్ని దేశాల్లో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ భారత ప్రతినిధి డాక్టర్ నాటా మెనబ్డే పైవిధంగా అన్నారు. ఫలితంగా బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. చైనా తరువాత అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేస్తున్నది భారతదేశమే కావడం గమనార్హం. మనదేశంలో పొగాకు ఉత్పత్తుల ఉపయోగించడం వల్ల ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగాకు ధరను పది శాతం పెంచితే వినియోగాన్ని 4-5 శాతం తగ్గించవచ్చని నాటా అన్నారు. పెరుగుతున్న వినియోగం ధూమపానం గురించి సినిమాలు, టీవీ ప్రకటనల్లో ఎంతగా హెచ్చరిస్తున్నా, ముంబైకర్ల ధోరణిలో మాత్రమ మార్పు కనిపించడం లేదు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు సిగరెట్ల వినియోగాన్ని చాలా పెంచామని పొగరాయుళ్లలో 41 శాతం మంది తెలిపారు. ప్రైవేటు బీమా కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు సిగరెట్లు ఉపయోగపడతాయని వీళ్లు భావిస్తున్నారని తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మందికి సిగరెట్‌ను వదిలిపెట్టాలన్న కోరిక లేదని వెల్లడించింది. -
ఏటా 70 లక్షల ప్రాణాలను తీస్తున్న వాయుకాలుష్యం
వాయు కాలుష్యమే కదా కొంత జలుబూ, కాసిని తుమ్ములు తుమ్మేస్తే సరిపోతుందిలే అనుకోకండి. వాయుకాలుష్యం ఆయువు లాగేస్తుంది. ప్రాణాలు తీసేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2012 లో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల ప్రాణాలను తీసింది వాయుకాలుష్య భూతం. ఈ మరణాల్లో 80 శాతం పక్షవాతం, గుండెపోటు వల్ల వచ్చినవే. అంతేకాదు. ఆసియా ఖండం, ముఖ్యంగా ఆగ్నేయాసియా లో వాయుకాలుష్య మరణాలు చాలా ఎక్కువ. ఇవే కాక బొగ్గు, వంటచెరుకుల నుంచి వెలువడే పొగ కూడా ప్రాణాలు తీస్తోందని నివేదిక తెలిపింది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. 2008 లో వాయు కాలుష్యం, పొగ వల్ల ౩౩ లక్షల మంది చనిపోయారు. మూడంటే మూడేళ్లలో ఇది రెండింతలైంది.