'80 శాతం పోలియో కేసులు పాక్లోనే'
ఇస్లామాబాద్: ప్రపంచంలో 80 శాతం పోలియో కేసులు పాకిస్థాన్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిపై ప్రగతి నివేదికను డబ్ల్యూహెచ్వో ఇక్కడ విడుదల చేసింది. దేశంలో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తీవ్రవాదులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలియో నిర్మూలన కోసం పాటుపడుతున్న ప్రచారకర్తలను తీవ్రవాదులు అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ లో ఈ పరిస్థితి అధికంగా ఉందని తెలిపింది. దీంతో పాకిస్థాన్లో పోలియో కేసులు ఉద్ధృతమవుతున్నాయి.