ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన | Smoke in Howrah Express Near Nekkonda in Warangal | Sakshi
Sakshi News home page

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన

Published Mon, Sep 11 2023 1:08 PM | Last Updated on Tue, Sep 12 2023 7:27 AM

Smoke in Howrah Express Near Nekkonda - Sakshi

సాక్షి, వరంగల్‌: హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్‌ జిల్లా నెక్కొండ సమీపంలో  సోమవారం ఉదయం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో భయందోళన చెందిన ట్రైన్‌ దిగి పరుగులు పెట్టారు.

రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. కాగా బ్రేక్‌ లైనర్‌లు పట్టుకోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక  హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు రావడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం కొరివి మండలం గుండ్రాతిమడుగు వద్ద కూడా రైలుతో పొగలు వ్యాపించాయి.
చదవండి: చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement