howra express
-
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన
సాక్షి, వరంగల్: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో సోమవారం ఉదయం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో భయందోళన చెందిన ట్రైన్ దిగి పరుగులు పెట్టారు. రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. కాగా బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక హౌరా ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం కొరివి మండలం గుండ్రాతిమడుగు వద్ద కూడా రైలుతో పొగలు వ్యాపించాయి. చదవండి: చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
హౌరా రైల్వే స్టేషన్ లో హైడ్రామా
-
యశ్వంతపూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ లో మంటలు
-
హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్.. అరెస్ట్
హైదరాబాద్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సోమవారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దంపతుల నుంచి 10 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి కోల్‌కతా మీదుగా బంగారాన్ని చెన్నైకు దంపతులు తీసుకవచ్చారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అందిన పక్కా సమాచారంతో డీఆర్ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్ చేసిన మరియ సెల్వరాజ్ అనే దంపతులను అరెస్ట్ చేశారు. -
రైలు నుంచి పొగలు.. ప్రయాణికుల పరుగులు
ద్వారపూడి: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. బుధవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో రైలు ద్వారపూడి స్టేషన్ సమీపంలో ఉండగా వెనుక బోగీ చక్రాలు పట్టేయడంతో పొగలు లేచాయి. ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. ప్రయాణికులు భయంతో వెంటనే రైలు దిగిపోయారు. సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను సరిచేసి రైలును పంపించేశారు. ఈ ఘటనలో రైలు సుమారు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. -
హౌరా ఎక్స్‌ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట
వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది. కదులుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్ నుంచి దూకి వారిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.