ఆ సిగరెట్టూ వద్దు... e-సిగరెట్టూ వద్దు! | sigarettu sigarettu do not want that | Sakshi
Sakshi News home page

ఆ సిగరెట్టూ వద్దు... e-సిగరెట్టూ వద్దు!

Published Mon, Aug 1 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఆ సిగరెట్టూ వద్దు... e-సిగరెట్టూ వద్దు!

ఆ సిగరెట్టూ వద్దు... e-సిగరెట్టూ వద్దు!

పొగతాగే దురలవాటు మానేయడానికి కొంతమంది ఎలక్ట్రానిక్ సిగరెట్ (e-సిగరెట్)ను ఆశ్రయిస్తుంటారు.

పరిపరి శోధన


పొగతాగే దురలవాటు మానేయడానికి కొంతమంది ఎలక్ట్రానిక్ సిగరెట్ (్ఛ-సిగరెట్)ను ఆశ్రయిస్తుంటారు. ఈ-సిగరెట్‌తో అంత ప్రమాదం ఉండదని వారు నమ్ముతుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమేననీ... ఈ-సిగరెట్స్‌లోనూ ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు, క్యాన్సర్ కారకాలు ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ-సిగరెట్‌లో ఆరోగ్యాన్ని ధ్వంసం చేయగల 31 రకాల రసాయనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఇందులోని ప్రతి దమ్ములోనూ ప్రొపిలీన్ ఆక్సైడ్, గ్లైసిడాల్ అనే హానికర పదార్థాలు ఒంట్లోకి చేరుతాయి. అంతేకాదు... ఈ-సిగరెట్ పరికరం పాతదవుతున్న కొద్దీ దాంట్లోంచి వెలువడే హానికర పదార్థాలు మరింతగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒంట్లోకి చేరే ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్, యాక్రోలిన్ అనే హానికారక పదార్థాల మోతాదు పెరుగుతుంటుంది. పైగా బ్యాటరీ  ఓల్టేజ్ పెరిగి... పరికరం వేడెక్కుతున్న కొద్దీ హానికారక పదార్థాల తీవ్రత కూడా పెరుగుతూ పోతుంటుంది.


‘‘సాధారణ సిగరెట్ కంటే ఈ-సిగరెట్‌లో ఊపిరితిత్తులనూ, కళ్లను దెబ్బతీసే ఆక్రోలిన్ అనే పదార్థం ఆరు రెట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ-సిగరెట్లు సురక్షితమైనవని ఈ ఒక్క దాఖలా సరిపోదు. మామూలు సిగరెట్లు పరమ అనారోగ్యకారకాలు అని అనుకుంటే ఈ-సిగరెట్లు అనారోగ్య కారకాలు... అంతేగానీ రెండూ అనారోగ్యానికి దారితీసేవే. అయినా అనారోగ్యం కలిగించే ఒక అలవాటును మానుకోవాలంటే ఇంకో అనారోగ్యపు అలవాటును ఆశ్రయించడం తప్పు కదా’’ అంటున్నారు ఈ-సిగరెట్లపై అధ్యయనం నిర్వహించిన లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీకి చెందిన అధ్యయనాల్లో పాలుపంచుకున్న హ్యూగో డెస్టాయిలేటస్. ఈ పరిశోధన సంస్థ యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తన అధ్యయనాలు నిర్వహిస్తోంది. పొగతాగే దురలవాటుకు దూరం అయి, పొందాల్సిన సంపూర్ణ ఫలితాల కోసం స్మోకింగ్‌ను పూర్తిగా వదిలేయడమే మేలు అంటున్నారు అధ్యయనవేత్తలు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement