వరంగల్: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం పొగలు వచ్చాయి. ఆ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వరంగల్ జిల్లా డోర్నకల్ స్టేషన్లో నిలిపి వేశారు. రైలులో పొగలు వస్తున్న ఎస్ 9, ఎస్12 బోగీలను పరిశీలించారు. లైనర్లు పట్టివేయడం వల్లే పొగలు కమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరమ్మతులు వేగవంతం చేశారు.