dornakal railway station
-
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
వరంగల్: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం పొగలు వచ్చాయి. ఆ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వరంగల్ జిల్లా డోర్నకల్ స్టేషన్లో నిలిపి వేశారు. రైలులో పొగలు వస్తున్న ఎస్ 9, ఎస్12 బోగీలను పరిశీలించారు. లైనర్లు పట్టివేయడం వల్లే పొగలు కమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరమ్మతులు వేగవంతం చేశారు. -
బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి
డోర్నకల్ : రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ చేతిలోని నగల పెట్టెను కోతి ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం డోర్నకల్‌లో చోటుచేసుకుంది. మండలంలోని ఉయ్యాలవాడ శివారులోని ఓ తండాకు చెందిన కళావతి వరంగల్‌కు వెళ్లేందుకుగానూ డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఇంతలో ఓ కోతి కళావతి చేతిలోని పర్సు లాక్కొని, అందులో ఉన్న ఆభరణాల పెట్టెను ఎత్తుకెళ్లింది. వెంటనే కళావతి కేకలు వేసింది. అప్పటికే కోతి ప్లాట్‌ఫామ్ గోడ దూకి పరారైంది. కొంతమంది ప్రయాణికులు కోతిని వెంబడించారు. ప్లాట్‌ఫామ్‌కు కొద్ది దూరంలో వెతకగా కోతి పడేసిన ఆభరణాల పెట్టె కనిపించింది. పరిసరాల్లో రెండు చెవి దుద్దులు లభ్యమయ్యాయి. ఇంకొక చెవిదుద్దు కనిపించడం లేదంటూ బాధితురాలు కళావతి పేర్కొంది.