బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి | monkey ran with gold ornaments | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి

Published Tue, Aug 30 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి

బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి

డోర్నకల్‌ : రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ చేతిలోని నగల పెట్టెను కోతి ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం డోర్నకల్‌లో చోటుచేసుకుంది. మండలంలోని ఉయ్యాలవాడ శివారులోని ఓ తండాకు చెందిన కళావతి వరంగల్‌కు వెళ్లేందుకుగానూ డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఇంతలో ఓ కోతి కళావతి చేతిలోని పర్సు లాక్కొని, అందులో ఉన్న ఆభరణాల పెట్టెను ఎత్తుకెళ్లింది. వెంటనే కళావతి కేకలు వేసింది. అప్పటికే కోతి ప్లాట్‌ఫామ్‌ గోడ దూకి పరారైంది. కొంతమంది ప్రయాణికులు కోతిని వెంబడించారు. ప్లాట్‌ఫామ్‌కు కొద్ది దూరంలో వెతకగా కోతి పడేసిన ఆభరణాల పెట్టె కనిపించింది. పరిసరాల్లో రెండు చెవి దుద్దులు లభ్యమయ్యాయి. ఇంకొక చెవిదుద్దు కనిపించడం లేదంటూ బాధితురాలు కళావతి పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement