చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి బర్డ్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభించడానికి ఆయన బస్సులో బయలుదేరారు.
అయితే, బస్సు అవిలాల వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పొగలు వచ్చి బస్సు నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు ముఖ్యమంత్రిని మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు. బస్సులో పొగలు రావడంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.