
తిరుమల వెళ్తున్న గవర్నర్ వాహనంలో పొగలు
తిరుమల: శ్రీవారి దర్శనానికి గురువారం తిరుమల బయలుదేరిన గవర్నర్ నరసింహన్ వాహనంలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. ఆ విషయాన్ని గవర్నర్ కాన్వాయిలోని భద్రత సిబ్బంది వెంటనే గమనించి... కారును ఆపి అందులో నుంచి గవర్నర్ను దింపివేశారు. అనంతర మరో వాహనంలో గవర్నర్ నరసింహన్ తిరుమల బయలుదేరి వెళ్లారు.
ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కారు వద్దకు చేరుకుని... అకస్మాత్తుగా కారులో పొగులు వ్యాప్తికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. తిరుచానురులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. గురువారం శ్రీవారిని దర్శించుకునే క్రమంలో తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.