సాక్షి, జనగామ: విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ (ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్‌లో పొగలు కమ్ముకోవడంతో జనగామ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంతో సాంకేతిక సమస్య తలెత్తి పొగలు వెలువడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మతు చర్యలు చేపడుతున్నారు.
ఒక్కసారిగా రైళ్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సహాయ చర్యలు చేపడుతున్నామని సమస్య పరిష్కారం కాగానే యధావిధిగా రైలు ముందుకు వెళ్తుందని తెలియడంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment