
చంద్రబాబు వాహనంలో పొగలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర పర్యటనలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది.
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర పర్యటనలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో మధురవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన బస్సులో రాజమండ్రి వెళ్తున్న తరుణంలో బాబు ప్రయాణిస్తున్న వాహనంలో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి.
వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్త మయ్యారు. మరో వాహనంలో చంద్రబాబు రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. షార్ట్ సర్య్యూట్ కారణంగా నే పొగలు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.