పనాజి: భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం గోవా- ఢిల్లీల మధ్య రాజధానీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. గోవా నుండి దేశ రాజధానికి ఎక్స్ప్రెస్ రైలును నడపాలని గోవా ప్రజలు ఎప్పటినుండో కోరుతున్నారు. కాగా సురేష్ ప్రభు గత గోవా పర్యటనలో రాజధాని ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం గోవాలోని మడగావ్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. మడగావ్ నుండి హజరత్ నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని కొంకన్ రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వెల్లడించారు.
గోవా, ఢిల్లీల మధ్య రాజధాని ఎక్స్ప్రెస్
Published Sat, Nov 14 2015 7:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM
Advertisement
Advertisement