ఒడ్డున బెడ్డు! ఊరించే ఫుడ్డు్డ! ఊయల పడక! ఊగించే పానీయం
మాట్లాడితే మనవాళ్లు గోవాకు భలే వెళ్లొస్తుంటారు. మనకెందుకో వీలు కాదు! ‘అరె పాయింటే’ నని మీకూ అనిపిస్తోంటే.. మీరు కూడా గోవాకు వెళ్లాలనుకుంటూనే వెళ్లలేక పోతున్నారనేగా. దేనికైనా టైమ్ రావాలండి. మరేం పర్వాలేదు. ఇప్పుడొచ్చింది టైమ్. వెంటనే ట్రైన్ ఎక్కేయండి. గోవాకు కాదు. ఢిల్లీకి. ఢిల్లీకా? అక్కడేం ఉంది? గోవా ఉంది!!
ఢిల్లీలో సముద్రమే లేదు! మరి గోవా ఎలా ఉంటుంది? సముద్రం లేదు కానీ, సముద్రం ఒడ్డున ఉన్న ఫీల్‌తో, గోవాలాంటి పరిసరాలతో ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఇటీవలే ఓ రెస్టారెంట్ ఓపెన్ అయింది. దారి పేరు ‘లేడీ బాగా’. గోవా ఒడ్డున ఎలాంటి హట్స్ ఉంటాయో; తినడానికి, తాగడానికి అక్కడ ఏమేం దొరుకుతాయో అన్నీ ఈ లేడీ బాగాలో ఉంటాయి, దొరుకుతాయి. ఇసుక, చెట్ల మధ్య ఊగే ఊయల, రంగురంగుల కుషన్ ఆసనాలు అన్నీ.. అచ్చం గోవా ఫీల్‌నే ఇస్తాయి. గోవా గోవాలోనే ఎందుకుండాలి? వెళ్లొచ్చేయండి.