న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొన్ని సెక్టార్‌లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో కోచ్‌లను మార్చాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఏసీ-2 టైర్ కోచ్‌లను ఏసీ-3 టైర్ కోచ్‌లుగా మార్చబోతోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏడాది అన్ని ఏసీ-2 టైర్ టైర్ కోచ్‌లను తీసేసి, 250 ఏసీ-3 టైర్ కోచ్‌లను ఇన్‌స్టాల్ చేయబోతోంది. సీనియర్ రైల్వే అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ-2 టైర్ కోచ్‌లు ఉంటాయి.
వాటిని కొంతమంది ప్యాసెంజర్లు మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, దీంతో రైల్వేకు రెవెన్యూ నష్టాలు వస్తున్నట్టు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. మరోవైపు ఏసీ-3 టైర్ కోచ్‌లకు రైళ్లలో భారీ ఎత్తున్న డిమాండ్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఇవి చేధించి, లాభాలను ఆర్జిస్తున్నాయి. కోచ్‌ల మార్పుతో పాటు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను కూడా సమీక్షించాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. దీని స్థానంలో రెంటల్ శ్లాబులను తీసుకురావాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ శ్లాబులతో ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను మరింత సరళతరం చేయనుంది. ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను 2016 సెప్టెంబర్‌లో దేశీయ రైల్వే లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment