Duronto Express
-
దురంతో ఎక్స్‌ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
-
నేటి నుంచే రైల్వే బుకింగ్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్ బుకింగ్‌లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే.. హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్–హౌరా: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు.. విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్ హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్‌ప్రెస్ ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. -
‘దూద్ దురంతో’ పార్శిల్ రైళ్లు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఆహార వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో రైల్వేశాఖ ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు రైల్వే పార్శిల్ వ్యాన్లను పట్టాలెక్కించింది. వీటి ద్వారా సరుకుల్ని సరఫరా చేస్తోంది. మూడు రోజుల కిందట సికింద్రాబాద్ నుంచి హౌరాకు తొలి పార్శిల్ రైలు నడిపి 92 టన్నుల ఆహార వస్తువుల్ని తీసుకెళ్లింది. (ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...) శనివారం ఢిల్లీ ప్రజల అవసరాల్ని తీర్చేందుకు గాను రేణిగుంట నుంచి హజరత్ నిజాముద్దీన్‌కు ‘దూద్ దురంతో’ పార్శిల్ రైళ్లను ప్రారంభించింది. 2.4 లక్షల లీటర్ల పాలు, 23 టన్నుల మామిడి, 23 టన్నుల పుచ్చకాయల్ని ఈ రైళ్లలో తీసుకెళ్లారు. సాధారణంగా పార్శిల్ వ్యాన్ల రైలు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ప్రజల అవసరాల దృష్ట్యా తొందరగా సరుకు చేరాల్సి ఉన్నందున గంటకు 55 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. (లాక్డౌన్ దశలవారీగా సడలింపు!) -
రైల్లోనే షాపింగ్!
న్యూఢిల్లీ: రైల్లో గంటల తరబడి ప్రయాణించడం విసుగ్గా ఉంటోందా.. అయితే, హాయిగా షాపింగ్ చేసుకోండి అంటోంది రైల్వే శాఖ. రైళ్లలో ‘ఆన్‌బోర్డ్ సేల్స్’ను అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఈ షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. ప్రయాణికుల ఆదరణ ఆధారంగా మిగలిన రైళ్లలోనూ ప్రవేశపెడతారు. ఈ ఆన్‌బోర్డ్ సేల్స్‌లో సెంట్లు, బ్యాగులు, వాచీలు వంటి అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌లో దీనికి టెండర్లు పిలుస్తామని, డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెడతామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నుంచే కోణార్క్, దురంతో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో అమ్మకాలు ప్రారంభిస్తామని మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగడంతో పాటు తమకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా ఆలోచించాలని రైల్వేశాఖ అన్ని జోన్లకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని, ప్రస్తుతం ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో వీటిని పెట్టాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. అలా గే, ఫుట్ మసాజ్ రోబోటిక్ చైర్లు, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అల్యూమినియం బోగీలు ప్రస్తుతం ఉన్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియంతో తయారు చేసిన బోగీలను ఉపయోగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. అయితే, ఈ పరిజ్ఞానం మనకు అందుబాటులో లేనందున జపాన్, ఐరోపా దేశాల సాయం తీసుకోనున్నారు. ఈ దేశాలు 15 ఏళ్లుగా అల్యూమినియం బోగీలనే వాడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఇనుప బోగీలు బరువు ఎక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా ఈ బోగీలు తుప్పు పడతాయి. అల్యూమినియం బోగీలు తేలిగ్గా ఉంటాయి. తుప్పు పట్టవు. కాబట్టి వీటి వాడకం వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మొదటి దశలో ఏటా 250 అల్యూమినియం బోగీలు తయారు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బోగీ తయారీకి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైళ్లకూ స్వచ్ఛ గ్రేడ్లు! ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ల శుభ్రతకోసం చర్యలు తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో శుభ్రతపై దృష్టి పెట్టింది. టాయ్లెట్లు సహా రైలు బోగీలు, సీట్ల శుభ్రత, హౌస్ కీపింగ్ వంటి అంశాలను పరిశీలించి రైళ్లకు శుభ్రతా గ్రేడ్లు ఇస్తారు. ఇందుకోసం 50 ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 200 రైళ్లను పరిశీలించి వాటికి గ్రేడ్లు ఇస్తుంది. శతాబ్ది, రాజధాని, దురం తో వంటి 72 ప్రీమియం రైళ్లు, కోణార్క్, జనశతాబ్ది, సంపర్క్ వంటి 128 రైళ్లలో తనిఖీలు చేపడతాయి. ఒక్కో ప్రీమియం రైలుకు సంబంధించి కనీసం 100 మంది, ఇతర రైళ్లకు సంబంధించి కనీసం 60 మం ది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఈ బృంద సభ్యులు స్వయంగా రైళ్లను పరిశీలిస్తారు. -
రైల్వే మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొన్ని సెక్టార్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో కోచ్‌లను మార్చాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఏసీ-2 టైర్ కోచ్‌లను ఏసీ-3 టైర్ కోచ్‌లుగా మార్చబోతోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏడాది అన్ని ఏసీ-2 టైర్ టైర్ కోచ్‌లను తీసేసి, 250 ఏసీ-3 టైర్ కోచ్‌లను ఇన్స్టాల్ చేయబోతోంది. సీనియర్ రైల్వే అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ-2 టైర్ కోచ్‌లు ఉంటాయి. వాటిని కొంతమంది ప్యాసెంజర్లు మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, దీంతో రైల్వేకు రెవెన్యూ నష్టాలు వస్తున్నట్టు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. మరోవైపు ఏసీ-3 టైర్ కోచ్‌లకు రైళ్లలో భారీ ఎత్తున్న డిమాండ్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఇవి చేధించి, లాభాలను ఆర్జిస్తున్నాయి. కోచ్‌ల మార్పుతో పాటు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను కూడా సమీక్షించాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. దీని స్థానంలో రెంటల్ శ్లాబులను తీసుకురావాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ శ్లాబులతో ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను మరింత సరళతరం చేయనుంది. ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను 2016 సెప్టెంబర్‌లో దేశీయ రైల్వే లాంచ్ చేసింది. -
పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్
-
పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నాగపూర్-ముంబైల మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున టిట్వాల అనే ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. పూర్తిగా ఏసీ రైలు అయిన దురంతో ఇంజిన్, ఏడు బోగీలు పట్టాలు నుంచి పక్కకు వెళ్లిపోయాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, గత 10 రోజుల్లో దేశంలో రైళ్లు పట్టాలు తప్పడం ఇది నాలుగోసారి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం పట్టాల కింద భూమి కొట్టుకుపోవడమేనని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. జోరుగా వర్షం కురుస్తుడటం సహాయక చర్యలకు అడ్డంకిగా మారినట్లు చెప్పారు. -
ఆగిన దురంతో ఎక్స్‌ప్రెస్
వేటపాలెం: ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దురంతో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తుండా ప్రకాశం జిల్లా వేటపాలెం సమీపంలో సోమవారం రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అధికారులు రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ రూట్లో ప్రయాణిస్తున్న రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. -
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఆభరణాలు దోపిడీ
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ప్రాథమిక సమచారం మేరకు... విశాఖ గీతం వర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కేఎల్వీ రావు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం బయల్దేరారు. మంగళవారం ఉదయం రైలు అనకాపల్లికి చేరుకున్న సమయంలో ప్రొఫెసర్ రావు తన బ్యాగు చూసుకోగా అందులోని బంగారు ఆభరణాల బాక్స్ కనిపించలేదు. దీంతో విశాఖలో రైలు దిగిన తర్వాత రావు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 84 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. -
రైలు ప్రమాద మృతులను గుర్తించారు
గుల్బర్గా : సికింద్రాబాద్ - బాంద్రా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులను రైల్వే అధికారులు గుర్తించారు. కర్ణాటకలో శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఈ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో మొత్తం ఇద్దరు మహిళలు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డ విషయం విదితమే. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే గుల్బర్గా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ రైల్వే కేంద్రం పరిధిలోని గుల్బర్గా సమీపంలో ఈఘటన చోటుచేసుకుంది. మృతులు లత(28), జ్యోతి(46) లుగా అధికారులు గుర్తించారు. వీరు పుణెకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. సికింద్రాబాద్ - లోకమాన్య తిలక్ 2220 ట్రైన్ తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
పట్టాలు తప్పిన ఎల్టీటీ దురంతో ఎక్ప్ ప్రెస్ రైలు
-
‘దురంతో’ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
ఓ మహిళకు చెందిన కిలోన్నర బంగారు ఆభరణాలు మాయం హైదరాబాద్: విశాఖపట్టణానికి చెందిన ఒక మహిళ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు వస్తుండగా ఆమెకు చెందిన 149 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... విశాఖకు చెందిన జి.నాగకేశవేణు (52) అనే మహిళ తన మనవరాలి (బిడ్డ కుమార్తె)తో కలిసి గురువారం సాయంత్రం విశాఖలో బయలు దేరి శుక్రవారం దురంతో ఎక్స్‌ప్రెస్ (ఏటూకోచ్ బి40 వ బెర్త్)లో నగరానికి చేరుకుంది. ఆమె చందానగర్‌లో ఉంటున్న తన కుమార్తెతో కలిసి ఈ నెల15న హైదరాబాద్‌లోని మదీనాగూడలో జరగనున్న ఓ వివాహంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు, కుమార్తెకు చెందిన 149 తులాల బంగారు ఆభరణాలను వెంట తీసుకుని వచ్చింది. వాటిని తన హ్యాండ్ బ్యాగులో భద్రపరిచి తలకింద పెట్టుకుని నిద్రించింది. అర్థరాత్రి వేళ ఓ మారు చూసుకుంటే భద్రంగానే ఉన్న ఆమె హ్యాండ్‌బ్యాగ్ ఉదయం నాలుగు గంటల సమయంలో చూస్తే కనిపించలేదు. బ్యాగు గల్లంతైనట్టుగా గుర్తించిన బాధితురాలు డ్యూటీలో ఉన్న టీసీకి సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక ఇక్కడి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ఒక్క విజయవాడలో మాత్రమే హాల్టు ఉంది. అక్కడే ఆమె ఆభరణాలు పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఎసీ కోచ్‌లోకి టీసీ, బెడ్రోలర్ మినహా ఇతరులు అనుమతించరు. ఇలాంటి స్థితిలో ఆభరణాలు ఎలా గల్లంతయ్యాయన్న విషయమై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
విశాఖ - హైదరాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున నగదు, బంగారాన్ని దోచుకున్నారు. దీంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దురంతోకు అదనపు బోగీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడిచే దురంతో (22204/22203) ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒక సెకండ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. పలు ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా ఏసీ చైర్‌కార్ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం (2వ తేదీ) నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ ఉదయం 10.25 గంటలకు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నాందేడ్ నుంచి అమృత్సర్ వెళ్లే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్.. నాందేడ్ నుంచి ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. -
పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్
చండీగఢ్: దురంతో ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. పంజాబ్ లోని మౌలిజగ్రంగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దురంతో ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం లేదు. ఎంతమంది గాయపడ్డారనేది తెలియాల్సివుంది. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
ఉరిలి వద్ద రైలు ప్రమాదం
పింప్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన దురంతో ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం 7.30 గంటలకు పుణేలోని ఉరిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రోజువారీ కూలీలు మరణించగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అందిన వివరాల మేరకు.. ఈ రైలు ముంబైలోని లోకమాన్యతిలక్ టర్మినల్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఉరిలి-యావత్ రైల్వే స్టేషన్ల మధ్య సిగ్నల్ రాకపోవడంతో గార్డు గేట్ వేయలేదు. అయితే రెండు ట్రాలీలను జోడించిన ట్రాక్టర్ గేటు దాటుతుండగా ప్రమాదం సంభవించింది. మొదటి ట్రాలీ సురక్షితంగా బయటపడినప్పటికీ రెండవ ట్రాలీ పట్టాలు దాటుతుండగా దూసుకు వచ్చిన ఈ రైలు ఢీకొట్టింది. దీంతో ఈ ట్రాలీ వంద అడుగుల దూరంలో ఎగిసి పడింది. ఇందులో ప్రయాణిస్తున్న రోజువారీ కూలీలు అహ్మద్‌నగర్‌లోని తాంబేవాడికి చెందిన కాభారీ విఠోబా మహ్మవర్ (50), ఇందుభాయి భాగీనాథ్ హండాలే (45), పాతర్డికి చెందిన తాయినాందేవ్ భరడే ఘటనాస్థలంలోనే మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ చెరకు కోసేందుకు ట్రాలీల్లో కోయడనాకి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే సిగ్నల్ పడకపోవడంతో గేట్ వేయని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత దురంతో ఎక్స్‌ప్రెస్ ముందుకు సాగింది. అయితే అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి హానీ జరగలేదు.