
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఆహార వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో రైల్వేశాఖ ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు రైల్వే పార్శిల్ వ్యాన్లను పట్టాలెక్కించింది. వీటి ద్వారా సరుకుల్ని సరఫరా చేస్తోంది. మూడు రోజుల కిందట సికింద్రాబాద్ నుంచి హౌరాకు తొలి పార్శిల్ రైలు నడిపి 92 టన్నుల ఆహార వస్తువుల్ని తీసుకెళ్లింది. (ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...)
శనివారం ఢిల్లీ ప్రజల అవసరాల్ని తీర్చేందుకు గాను రేణిగుంట నుంచి హజరత్ నిజాముద్దీన్‌కు ‘దూద్ దురంతో’ పార్శిల్ రైళ్లను ప్రారంభించింది. 2.4 లక్షల లీటర్ల పాలు, 23 టన్నుల మామిడి, 23 టన్నుల పుచ్చకాయల్ని ఈ రైళ్లలో తీసుకెళ్లారు. సాధారణంగా పార్శిల్ వ్యాన్ల రైలు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ప్రజల అవసరాల దృష్ట్యా తొందరగా సరుకు చేరాల్సి ఉన్నందున గంటకు 55 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. (లాక్డౌన్ దశలవారీగా సడలింపు!)