దురంతోకు అదనపు బోగీ ఏర్పాటు | additional bogie for duronto express | Sakshi
Sakshi News home page

దురంతోకు అదనపు బోగీ ఏర్పాటు

Published Fri, Jan 2 2015 3:11 AM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM

additional bogie for duronto express

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడిచే దురంతో (22204/22203) ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒక సెకండ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు.  

పలు ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్‌టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా ఏసీ చైర్‌కార్ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.

నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం (2వ తేదీ) నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ ఉదయం 10.25 గంటలకు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నాందేడ్ నుంచి అమృత్‌సర్ వెళ్లే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్.. నాందేడ్ నుంచి ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement