దురంతోకు అదనపు బోగీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడిచే దురంతో (22204/22203) ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒక సెకండ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు.
పలు ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా ఏసీ చైర్‌కార్ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.
నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం (2వ తేదీ) నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ ఉదయం 10.25 గంటలకు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నాందేడ్ నుంచి అమృత్సర్ వెళ్లే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్.. నాందేడ్ నుంచి ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.