సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నాగపూర్-ముంబైల మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున టిట్వాల అనే ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. పూర్తిగా ఏసీ రైలు అయిన దురంతో ఇంజిన్, ఏడు బోగీలు పట్టాలు నుంచి పక్కకు వెళ్లిపోయాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, గత 10 రోజుల్లో దేశంలో రైళ్లు పట్టాలు తప్పడం ఇది నాలుగోసారి.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం పట్టాల కింద భూమి కొట్టుకుపోవడమేనని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. జోరుగా వర్షం కురుస్తుడటం సహాయక చర్యలకు అడ్డంకిగా మారినట్లు చెప్పారు.