సిగ్నల్ జంప్.. జస్ట్ మిస్
చైనా: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా స్కూటీ నడుపుతూ ఓ చైనా వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకొని బతికి బట్టగట్టాడు. రెడ్ సిగ్నల్ ఉందనే స్పృహ లేకుండా సడెన్‌గా సిగ్నల్ జంప్ చేసి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. దీంతో అటువైపు వేగంగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టడంతో మనోడు గాల్లో చక్కెర్లు కొడుతూ కింద పడిపోయాడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ తర్వాత కారును డ్రైవ్ చేస్తున్న మహిళ అతని దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడసాగింది.
అనంతరం ఏమి జరిగిందో తెలియలేదు. జంక్షన్ సీసీటీవీ ఫుటేజి నుంచి ఈ వీడియో తీసుకున్న ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అతనొక ప్రోఫేషనల్ స్టంట్ మ్యాన్ అంటూ తెగ కామెంట్లోస్తున్నాయి. మీరు చూడండి ఓ సారి..