బంజారాహిల్స్: రాంగ్‌రూట్‌లో వస్తున్నావని ప్రశ్నించిన ట్రాఫిక్ హోంగార్డుపై ఆటోవాలా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. హోంగార్డును ఉరికించి తీవ్రంగా కొడుతూ బండరాయితో హత్య చేసేందుకు యతి్నంచిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్యాల మెహర్ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ హోంగార్డు జయప్రకాష్ కృష్ణానగర్ ఇందిరానగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆటోడ్రైవర్ ఎండీ ఒమర్ షరీఫ్ ఇందిరానగర్ గడ్డ నుంచి రాంగ్‌రూట్‌లో కృష్ణానగర్ వైపు వస్తున్నాడు. ఇదేం పద్ధతి అని, రాంగ్‌రూట్‌లో ఎందుకు వస్తున్నావని హోంగార్డు ప్రశ్నించాడు. నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్ షరీఫ్.. హోంగార్డుపై విచక్షణారహితంగా పిడిగుద్దులతో గాయపర్చాడు. నిందితుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయతి్నంచిన హోంగార్డును వెంబడించి చితకబాదాడు.
అందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న బండరాయిని ఎత్తుకుని హోంగార్డును హత్య చేసేందుకు యత్నించగా బాధితుడు త్రుటిలో తప్పించుకుని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంటల వ్యవధిలోనే పరారీలో ఉన్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 132, 121, 125 (ఏ), 126 (2), 119, ఎంవీయాక్ట్ 177 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment