అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్‌ | Police officer saved person who participated in Amaravati Yatra | Sakshi
Sakshi News home page

అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్‌

Published Wed, Oct 19 2022 3:56 AM | Last Updated on Wed, Oct 19 2022 12:17 PM

Police officer saved person who participated in Amaravati Yatra - Sakshi

సీపీఆర్‌ చేస్తున్న సీఐ త్రినాథ్‌

సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్రలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీస్‌ అధికారి నిలబెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాదయాత్ర కొనసాగుతుండగా.. ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్‌ వారి వద్దకు రాలేని పరిస్థితి ఎదురైంది.

ఇంతలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న సీఐ త్రినాథ్‌ వేగంగా స్పందించారు. సీపీఆర్‌ చేయడంతో అతని ప్రాణం లేచి వచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో వేగంగా స్పందించి ప్రాణం నిలబెట్టిన సీఐ త్రినాథ్‌ను అక్కడున్నవారంతా ప్రశంసించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement