నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో సీపీఆర్ ట్రైనింగ్ | CPR Awareness Programme By NATS | Sakshi
Sakshi News home page

నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో సీపీఆర్ ట్రైనింగ్

Published Mon, May 20 2019 10:36 PM | Last Updated on Mon, May 20 2019 10:38 PM

CPR Awareness Programme By NATS - Sakshi

సెయింట్ లూయిస్ నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ) ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడేవారిని కాపాడేందుకు సీపీఆర్ ప్రక్రియ ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చు. భాషే రమ్య.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ ఇప్పుడు ఈ అంశంపై కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సెయింట్ లూయిస్ నాట్స్ చాప్టర్ ఇప్పుడు సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను స్థానిక తెలుగు సంఘం టీ.ఏ.ఎస్ తో  కలిసి చేపట్టింది. దాదాపు 80 మంది తెలుగువారు ఈ సీపీఆర్ శిక్షణకు హాజరయ్యారు.

 

శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్‌లను అందించారు. ఇక్కడకు వచ్చిన వారికి నాట్స్ ఉచితంగా సీపీఆర్ కిట్స్ అందించింది. అత్యవసరంగా గుండె నొప్పి వస్తే  అలాంటి వ్యక్తులను  వైద్యశాలకు ఎలా తరలించాలి. ఆ లోపల శ్వాస ఎలా అందించాలి అనే అంశాలను డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాగ శిష్ట్లా  తదితరుల నాయకత్వంలో ఏర్పాటైన ఈ శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభించింది. ప్రాణాలను కాపాడే ఇలాంటి శిక్షణ ఎంతో ఉపయోగకరమైందని శిక్షణ తీసుకున్న వారు హర్షం వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, టీఏఎస్ డైరక్టర్లు శ్రీనివాస్ భూమ, జగన్ వేజండ్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దీంతో పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాట్స్ సభ్యులందరిని అభినందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement