కొన్ని పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అవి చూసేందుకు కూడా చాలా వింతగా ఉంటాయి. పురాణల్లోనో, సినిమాల్లోనో చూసి ఉంటాం అలాంటి రెండు తలలు పాముల లేదా ఐదు తలల పాములు. అంతేతప్ప మాముటుగా చూడటం కుదరదు. పైగా తాచుపాము జాతుల్లోని ప్రత్యేక పాములే ఇలా ఉంటుంది. ఆ ఐదు తలలు సెపరేట్‌గా ఉండి ఆ తలలన్నింటికి ఒకటే దేహంలా కింద భాగం ఉంటుంది.
కానీ ఇక్కడ ఈ పాము అందుకు విభన్నం రెండు తలలు కలిసి పోయి ఉంటుంది. అచ్చం మనుషులకు జన్మించే అవిభక్త కవలల మాదిరిగా ఆ పాము ఉంది. నిజానికి ఆ రీతిలో జన్మించినవి పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. కానీ ఇది అలా కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంది. హాయిగా కదులుతుంది. కాస్త ఆహారం తినేటప్పుడూ ఇబ్బంది పడుతుందేమో గానీ చూస్తే మాత్రం మాములు పాముల మాదిరిగానే పాకుతుండటం విశేషం. ఈ ఘటన యూకేలోని ఓ దుకాణంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!)
Comments
Please login to add a commentAdd a comment