‘తంగలాన్’ సినిమాలో బంగారానికి పాములు కాపలా కాస్తున్నట్లు దర్శకుడు చూపించాడు. గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయని పూర్వం చందమామ కథల్లో విఠలాచార్య సినిమాల్లో చూపించేవారు. తంగలాన్‌లో బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి. బంగారం గునుల్లో, నిధుల దగ్గర పాములు నిజంగానే ఉంటాయా? కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అని.
బంగారం, యురేనియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయని వారి అధ్యయనంలో కనిపించింది. పాములు తమ శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్‌ను దాస్తాయట. పాములు బయో ఇండికేటర్స్‌గా పని చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. యురేనియం దోరికే ప్రాంతాల్లో గాని బంగారం దొరికే కోలార్ వంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తుండేది అందుకే అని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment