
ముగ్గురితో ఎమ్మెల్యేలుగా బేడీ ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఫొటో
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి షాక్ తగిలినట్లయింది. ఆమె ప్రమాణస్వీకారం చేయించిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చారు. కిరణ్ బేడి నిర్ణయాన్ని శాసనసభ కార్యదర్శి విన్సెంట్ రాయ్ తప్పుబట్టారు. కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో బేడీ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే.
ప్రమాణస్వీకారం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయని ట్వీటర్ ద్వారా బేడీ పేర్కొన్నారు. కాగా, బేడీ నిర్ణయాన్ని అప్పట్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి.
Comments
Please login to add a commentAdd a comment