పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని 770 ఎంబీబీఎస్ అడ్మిషన్లను మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రీకృత కౌన్సిలింగ్ నిర్వహించకపోవడమే గాకుండా గడువు ముగిసిన అనంతరం గతేడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహించారని ఎంసీఐ పేర్కొంది. 2016–17 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన మొత్తం 770 మంది ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అడ్మిషన్లను రద్దు చేయాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య సేవల విభాగం డైరెక్టర్‌కు సెప్టెంబర్ 7న ఎంసీఐ లేఖ రాసింది.