నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల చింత ఎట్టకేలకు తీరింది. ఎంబీ బీఎస్ రెండవ సంవత్సరం తరగతుల నిర్వహణకు ఎంసీఐ అనుమతి లభించడంతో ఇటు విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వంద సీట్లు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడాదిగా రెండవ సంవత్సరం అనుమతి విషయంలో స్తంభన నెలకొంది.
సౌకర్యాలు లేవంటూ ఎంసీఐ పలుమార్లు అనుమతిని నిరాకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19 తేదీలలో ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం కళాశాల ను పరిశీలించింది. ప్రొఫెసర్ల కొరత, గ్రంథాలయం, వసతి భవనాలు సక్రమంగా లేవంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో అధికారులు లోపాలను సరి దిద్దేందుకు నడుం బిగించారు. గత నెల మొదటివారం లో ఎంసీఐ బృందం తిరిగి కళాశాలను పరిశీలించింది. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి, అనుమతి కోసం సిఫారసు చేసింది.
విస్తరించనున్న వైద్యసేవలు
తెలంగాణ నవ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని ప్రభు త్వ మెడికల్ కళాశాల మరింత పటిష్టం కానుంది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా కళాశాల అనుమతి నివేదికలో రాష్ట్ర ప్ర భుత్వమే పేర్కొంది. కనుక అధిక నిధులు కేటాయించి అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు రూ. 164 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడత 100 కోట్లు, రెండవ విడత 64 కో ట్లను విడుదల చేసింది. ఇప్పుడిక అన్ని సౌకర్యాలతో మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీం నగర్ ప్రాంతాల రోగులకు కూడా ముఖ్యమైన ఆస్పతిగా మారనుంది.
వైఎస్‌ఆర్ చలవతోనే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చలవతోనే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. 2008 అక్టోబర్ లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ షష్ఠి పూర్తి కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించా రు. 2009లో కళాశాలకు ప్రభుత్వం ని ధులను మంజూరు చేసింది. 2013 మే లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీ లనకు వచ్చింది. జులై 24న మొదటి ఏడాది తరగతులకు 100 సీట్లతో అనుమతి లభించింది. అదే ఏడాది ఆగస్టు ఐదున తరగతులు ప్రారంభమయ్యాయి.
డీఎంఈ చొరవతో
డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) మెరుగైన వైద్యసేవల కోసం ఈ కళాశాలపై దృష్టి సారించింది. ఇం దులో భాగంగానే 121 మంది ప్రొఫెసర్లు, 92 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను నియమించింది. ఆయా విభాగాల లో నిపుణులైన వైద్యులు ఇందులో ఉ న్నారు. న్యూరాలాజీ, కార్డియాలజీతోపాటు, ఇతర ముఖ్య సేవలు అం దు బాటులోకి వచ్చాయి. ఎంఆర్‌ఐ స్కాన్, సీటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రేలు, ఆధుని క ఆపరేషన్ థియేటర్లు, చిన్నపిల్లలకు సంబంధించిన ఎన్‌ఐసీ తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. ఎనిమిదంతస్తుల భవనంలో వెయ్యి పడకల ఆ స్పత్రి అందుబాటులో ఉంది.
పీజీ కోర్సులకూ అనుమతి
కళాశాల ఏర్పాటైన మొదటి ఏడాదే పీ జీ కోర్సులు అందుబాటులోకి వచ్చా యి. ఈ ఏడాది నుంచి డీఎన్‌బీ (డిప్లొ మా ఇన్ నేషనల్ బోర్డు)కు చెందిన పీజీ కోర్సులకు అనుమతి లభించింది. మూ డేళ్ల వ్యవధి గల మెడిసిల్, సర్జరీ, గైనిక్, ఫిజిషియన్, అనస్థీషియన్ కోర్సులకూ అవకాశం వచ్చింది. ఒక్కో కోర్సులో నాలుగు చొప్పున మొత్తం 20 సీట్లు మంజూరు కానున్నాయి.
చిన్నపిల్లలకు మేలు
చిన్నపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స లభించే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు దీర్ఘకాలిక వ్యా ధులు, మానసిక సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి, వారికి మెరుగైన వైద్యసేవలు అందించడానికి అత్యాధునిక వైద్యసేవలతో, నిపుణులైన వైద్యులతో ప్రత్యేక విభాగం నెలకొల్పాలని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిష న్ నిర్ణయించింది.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నా రు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అధికారి అరుణ్‌సింగ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ సహానీ గత ఫిబ్రవరి ఏడున మెడికల్ కళాశాలను సందర్శించారు. రూ. 13 కోట్ల రూపాయల తో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసేందు కు అంగీకరించారు.
యువతకు ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ కళాశాలలో ప్రభుత్వం 812 ఉద్యోగాలు భర్తీకి జీవో నం.50ని విడుదల చేసింది. ఇందులో పారామెడికల్ సిబ్బందితో పాటు పరిపాలన వి భాగం, వైద్యులు ఉన్నారు. 217 మంది స్టాఫ్ నర్సులు, 202 మంది నాల్గవ తరగతి ఉద్యోగులు, పరిపాలన విభాగాని కి సంబంధించి 50 మంది, సూపరిం డెంట్ పరిధిలో 189 మంది, పారా మె డికల్ సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెడికల్ కళాశాలకు ఎట్టకేలకు అనుమతి
Published Thu, Jul 17 2014 3:12 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement