
తూర్పు గోదావరి, యానాం: కోడిగుడ్లు తినకుండా ఒక్కసారే మింగడానికి ప్రయత్నించడం వ్యక్తి ప్రాణాలను తీసింది. పుదుచ్ఛేరిలో బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముదలియార్‌పేట పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కోమ్‌బక్కమ్‌కుప్పనపేటకు చెందిన రోజువారి కూలి గుణశేఖరన్ ఇంట్లో కూర వండడానికి ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లును మింగేందుకు ప్రయత్నించాడని ఈ నేపథ్యంలో అవికాస్తా గొంతు మధ్యలో ఉండిపోవడంతో ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో అమస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని తెలిపారు.
భార్య పునీత, స్థానికులు అతడిని స్థానిక ఇందిరా గాంధీ ప్రభుత్వసాధారణ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుణశేఖరన్ మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ముదలియార్‌పేట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.